Suraj Randeep : ధోనితో ఆడిన క్రికెటర్ ఇప్పుడు బస్సు డ్రైవర్ గా అష్టకష్టాలు.. అసలు ఎవరీయన? ఏంటా కథ?

సెలెక్టయిన క్రీడాకారులకు తిరుగుండదని భావిస్తారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడిన ప్లేయర్ ఒకరు ఇప్పుడు బతుకు కోసం బస్సు డ్రైవర్ గా మారడం ఆవేదన కలిగిస్తోంది. ఆయన ఎవరో కాదు శ్రీలంక స్పిన్నర్ సూరజ్ రణ్ దీప్.

Written By: Dharma, Updated On : June 19, 2023 6:33 pm
Follow us on

Suraj Randeep : ఈ రోజు గొప్పగా బతుకుతున్నాం.. ఇలానే జీవితాంతం సాగిపోతుందనుకుంటే పొరబడినట్టే. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి. నిత్య జీవితంలో ఈ తరహా ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. ఒక వెలుగు వెలిగి కిందపడిపోయిన వారు ఉన్నారు. ఎన్నోరకాల ఇబ్బందులను అధిగమించి పైకి వచ్చిన వారు ఉన్నారు. అయితే ఓ క్రికెట్ యథార్ధ గాథ మాత్రం కలిచివేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హేమాహేమీలతో మ్యాచ్ లు ఆడిన ఓ క్రికేటర్ బస్సు డ్రైవర్ గా మారాడు. కుటుంబ జీవనం కోసం అలా మారక తప్పలేదు.

ఒక్కసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడితే దశ తిరిగిపోతుందంటారు. కోట్ల రూపాయల సంపాదనకు పడగలెత్తవచ్చని చెబుతారు. లగ్జరీ లైఫ్ సొంతం చేసుకోవచ్చని కలలుకంటారు. సెలెక్టయిన క్రీడాకారులకు తిరుగుండదని భావిస్తారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడిన ప్లేయర్ ఒకరు ఇప్పుడు బతుకు కోసం బస్సు డ్రైవర్ గా మారడం ఆవేదన కలిగిస్తోంది. ఆయన ఎవరో కాదు శ్రీలంక స్పిన్నర్ సూరజ్ రణ్ దీప్. తొలుత శ్రీలంక జాతీయ జట్టులో చోటుదక్కించుకున్న సూరజ్ తరువాత 2011 వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకున్నాడు.

2011, 12 ఐపీఎల్ లో సైతం సూరజ్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో స్పిన్నర్ గా వ్యవహరించాడు. ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ ను సైతం పంచుకున్నాడు. చివరిగా శ్రీలంక జట్టులో వన్ డే మ్యాచ్ ఆడి క్రికెట్ కెరీర్ కు స్వస్తిపలికాడు. సాధారణంగా క్రికెట్ నుంచి వైదొలిగిన తరువాత కామెంటేటర్ తో పాటు అనేక కొలువులు వేచి ఉంటాయి. కానీ కారణాలు తెలియదు కానీ సూరజ్ మాత్రం విచిత్రంగా బస్సు డ్రైవర్ గా మారాడు. ఆస్ట్రేలియాలో ఓ కంపెనీలో బస్సు డ్రైవర్ గా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడినప్పుడు నాలుగు రాళ్లు వెనుకేసుకోలేక.. ఇటు రిటైర్మెంట్ తరువాత గౌరప్రదమైన కొలువు దక్కక బస్ డ్రైవర్ గా మారిన ఈ క్రికెటర్ విషయం తెలుసుకున్న వారి గుండె బరువెక్కుతోంది.