Odi World Cup 2023
Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా జరిగే మ్యాచ్ లు అంతా ఇంట్రెస్ట్ ని కలిగించడం లేదు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా వన్ సైడ్ మ్యాచ్ గానే మిగిలిపోతున్నాయి. దానివల్ల ఆ మ్యాచ్ చూసే ఆడియన్స్ ఏ మాత్రం థ్రిల్ కి ఫీల్ అవ్వకుండానే మ్యాచ్ లు ముగుస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్ లు 50 ఓవర్ల మ్యాచ్ లు కావడం వల్ల చాలా మందికి ఆ మొత్తం మ్యాచులు చూసే అంత ఇంట్రెస్ట్ కలగడం లేదు. దానికి తోడుగా ఈ మ్యాచులు మొత్తం వన్ సైడ్ అవడం వల్ల అందరూ మ్యాచ్ ని చూడకుండానే రిజల్ట్ మాత్రమే చూస్తున్నారు. ఇక దీన్ని బట్టి మ్యాచ్ చూసే వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది దానివల్ల బ్రాడ్ కాస్ట్ సంస్థలకు కూడా కొద్ది వరకు నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇలా కాకుండా ఒక మ్యాచ్ అనేది అధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంటే ప్రతి అభిమాని కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఉత్కంఠ భరితంగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సాగుతూ ఉంటే అలాంటి మ్యాచ్ చూసినప్పుడు ప్రేక్షకులు నిజంగా ఒక థ్రిల్ కి ఫీల్ అవుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ ఎంటైర్ టోర్నీలో ఒకటి రెండు మ్యాచ్ లను మినహాయిస్తే ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్ లో కూడా పెద్ద థ్రిల్లింగ్ ని కలిగించే అంశాలు లేకపోవడంతో ఆ మ్యాచ్ చూడాలనే ఇంట్రెస్ట్ ఎవ్వరికీ ఉండటం లేదు…
సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా చివరి వికెట్ వరకు పోరాడి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా విజయానికి 11 పరుగులు అవసరం ఉండగా వాళ్ళ చేతిలో ఇంకొక వికెట్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉంది. ఇక దాంతో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టీమ్ ప్లేయర్ అయిన మహారాజా ఫోర్ కొట్టడంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది…
ఇక ఈ టోర్నీ లో ఉత్కంఠను రేకెత్తించిన మరో మ్యాచ్ ఏంటంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 388 పరుగులు చేసింది.ఇక చేజింగ్ కి దిగిన న్యూజిలాండ్ టీం చివరి వరకు అద్బుతం గా పోరాడి మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చింది. అయినప్పటికీ చివరి వరకు వచ్చి 5 పరుగులు తేడాతో న్యూజిలాండ్ ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ కూడా అత్యంత ఉత్కంఠను రేకెత్తించింది ఈ రెండు మ్యాచ్ లను మినహాయిస్తే మిగిలిన ఏ మ్యాచులు కూడా పెద్దగా ఉత్కంఠగా సాగినవి అయితే లేవు….
ఇక ఇంగ్లాండ్, పాకిస్తాన్,శ్రీలంక జట్లను ఓడించిన ఆఫ్గనిస్తాన్ టీమ్ వీటి మీద ఆడిన మ్యాచ్ లో కూడా పెద్దగా ఉత్కంఠనైతే కలిగించలేదు. ఈ మ్యాచ్ లు సగం అయిపోయిగానే మ్యాచ్ మొత్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ లాగేసుకుంది దాంతో అవి పెద్ద గా ఉత్కంఠనైతే కలిగించలేదు. ఇక ఈ మ్యాచ్ లను చూసిన చాలా మంది అభిమానులు ఈ వరల్డ్ కప్ లో పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు, థ్రిల్లింగ్ మ్యాచ్ లు ఏమి జరగడం లేదు అనే తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.ఇక టి20 ఫార్మాట్ లో అయితే ఉత్కంఠను రేకెత్తించే మ్యాచులు జరుగుతూనే ఉండేవి…50 ఓవర్ల మ్యాచ్ కాబట్టి అసలు దీంట్లో పస ఏమి లేకుండానే నడుస్తున్నాయి కాబట్టి చాలామంది క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు…అందుకే వాళ్ళు మ్యాచ్ లు ఏమి చూడటం లేదు…అయినప్పటికీ ఇప్పుడు సెమీస్ కి వెళ్ళే టీములు ఏవి అనేదాని మీద మంచి మజా ఏర్పడుతుంది…