SUV Cars: త్వరలో మార్కెట్లోకి 5 SUV లు.. అవేంటంటే?

మహీంద్రా కంపెనీ ఎస్ యూవీల కార్లకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి XUV300 ఫేస్ లిప్ట్ ను రిలీజ్ చేయనుంది. గ్లోబల్ ట్రయల్స్ లో దీనికి ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్యాబిన్ పాత మోడల్ లా ఉన్నా ఇంజిన్ అదిరిపోతుంది అని అంటున్నారు.

Written By: Srinivas, Updated On : November 1, 2023 11:13 am

SUV Cars

Follow us on

SUV Cars: కారు కొనాలనుకునే వారు SUV లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బాహుబలి లాంటి ఇంజిన్ తో పాటు లార్జ్ స్పేస్ ఉండే ఎస్ యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే హ్యాచ్ బ్యాక్ కంటే ఎస్ యూవీల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా కన్వినెంట్ కోసం ఎస్ యూవీ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఎస్ యూవీలనే తయారు చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేలా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన మోడళ్ల కంటే అప్డేట్ ఫీచర్స్ ను అమర్చి రోడ్లపై తిప్పేందుకు రెడీ అయ్యాయి. అలాంటి 5 మోడళ్ల గురించి తెలుసుకుందాం..

దేశీయ మార్కెట్లో కియా దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే కొన్ని మోడళ్లు ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాదిలో కియా నుంచి ‘సోనెట్ ఫేస్ లిప్ట్’ రాబోతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోనేట్ ను అప్డేట్ చేశారు. దీనిని భారత మార్కెట్లో తీసుకురావడానికి టెస్టింగ్ చేస్తున్నారు.

మహీంద్రా కంపెనీ ఎస్ యూవీల కార్లకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి XUV300 ఫేస్ లిప్ట్ ను రిలీజ్ చేయనుంది. గ్లోబల్ ట్రయల్స్ లో దీనికి ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్యాబిన్ పాత మోడల్ లా ఉన్నా ఇంజిన్ అదిరిపోతుంది అని అంటున్నారు.

టాటా కంపెనీ నుంచి 2024లో ‘కర్వ్ ’ రాబోతుంది. ఇప్పటికే టాటా కంపెనీ ఎస్ యూవీలను తీసుకొచ్చి ఆకర్షించింది. ఇందులో నెక్సాన్, హారియర్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కర్వ్ ను స్వదేవీ ఆటోమేజర్ మైక్రో ఎస్ యూవీ కేటగిరిని కలిగి ఉంది. దీనిని 7 సీటర్ గా రూపుదిద్దారు.

మహీంద్రా నుంచి 5 డోర్ ఎస్ యూవీ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన థార్ ను అప్డేట్ చేసి కొత్త లుక్ తో తీసుకురానున్నారు. ఫీచర్లు కూడా పూర్తిగా మారే అవకాశం ఉంది.

హ్యుందాయ్ నుంచి కూడా కొత్త ఎస్ యూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా క్రెటా విపరీతంగా ఆకట్టుకుంది. 2024లో క్రెటా ఫేస్ లిప్ట్ ను లాంచ్ చేయనున్నారు. ఇది అప్డేట్ ఫీచర్స్ తో పాటు అధునాతన డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెబుతున్నారు.