ODI World Cup – Rohit : ఆ దంచికొట్టుడు ఏంది? ఆ సిక్సులు ఏందీ.. ఆ స్క్వైర్ లెగ్ లో ఫోర్లు ఏంటి? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దంచికొట్టుడుకు అప్ఘనిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న అప్ఘన్ వర్సెస్ ఇండియా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ వీర కొట్టుడుకు అప్ఘన్ ఆటగాళ్లు చేష్టలుడి చూస్తూ ఉండిపోయారు.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 64 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇందులో 4 సిక్సులు, 12 ఫోర్లు ఉండడం విశేషం. రోహిత్ శర్మ సెంచరీతోపాటు ఇసాన్ కిషన్ 47 పరుగులతో సహకారం అందించడంతో భారత్ కేవలం 18.4 ఓవర్లలోనే 156 పరుగుల భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలోనే సగం పరుగులు రావడం విశేషం.
అంతకుముందు అప్ఘనిస్తాన్ కూడా బాగానే ఆడింది. నిర్ణీత 50 ఓవర్లలో 272/8 పరుగులు చేసింది. ఇందులో అజ్మతుల్లా 62 పరుగులు, కెప్టెన్ షాహిదీ 80 పరుగులతో రాణించాడు. 8 వికెట్లకు 50 ఓవర్లలో అప్ఘనిస్తాన్ 272 పరుగులు చేసింది.
రోహిత్ దంచి కొట్టి ఫామ్ లోకి రావడం టీమిండియాకు శుభపరిణామంగా చెప్పొచ్చు.