ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ టీమ్ ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఒక మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి మొదట్లో మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ వాళ్ల ఓపెనర్లు అయిన రహమనుల్ల గురుబాజ్, ఇబ్రహీం జద్రాన్ ఇద్దరు కూడా కొద్దిసేపటి వరకు బాగా ఆడారు. ఇక గురుబాజ్ 21 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు…. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హాస్మతుల్లా సాహిది 80 పరుగులు చేసి చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్ టీం స్కోర్ ని నిదానంగా పెంచుకుంటూ వచ్చాడు.ఇండియన్ బౌలర్ లను దీటుగా ఎడురుకుంటు షాహిదీ, ఒమర్జై ఇద్దరూ కూడా 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆఫ్ఘనిస్తాన్ టీం మంచి స్కోర్ చేయడంలో వీళ్ళిద్దరూ చాలా బాగా హెల్ప్ అయ్యారు. అందులో భాగంగానే ఇద్దరు హాఫ్ సెంచరీ లను పూర్తిచేసుకుని ఆఫ్ఘనిస్తాన్ టీం కి గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో వీళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక ఈ టీం లో వీళ్ళిద్దరిని మినహాయిస్తే ఎవరు కూడా పెద్దగా ఆడలేదు సెంచరీ చేస్తాడనుకున్న షాహిది 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 80 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. ఇక ఒమార్జై కూడా 69 బంతుల్లో నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్లతో 62 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ ఇద్దరు కూడా కొంతమేరకు టీం కి ఎక్కువ స్కోర్ అందించడానికి ప్రయత్నించారు…ఇక ఆఫ్గనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లను కోల్పోయి 272 పరుగులు చేసింది నిజానికి ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా మంచి స్కోర్ చేసిందనే చెప్పాలి.
ఎందుకంటే ఇంతకుముందు ఇండియా ఆస్ట్రేలియా తో ఆడినప్పుడు ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ టీముల్లో ఒకటైన ఆస్ట్రేలియా టీం కూడా ఇండియా మీద 200 పరుగులు చేయలేకపోయింది. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మాత్రం 272 పరుగులు చేసిందంటే ఈ టీమ్ ని మెచ్చుకోవచ్చు. ఇక మన బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రిత్ బూమ్రా నాలుగు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు,అలాగే శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా తలో వికెట్ తీశారు… వాళ్ల వికెట్లు తీసిన కూడా మన బౌలర్లు వాళ్ళని తక్కువ స్కోర్ కి కట్టడి చేయడం లో.కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి…
అయితే తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ కొట్టేసి దుమ్ము రేపుతున్నాడు. భారత్ విజయం దిశగా సాగుతోంది. రోహిత్ సిక్సర్ల మోత మోగుతోంది.