Odi World Cup 2023: హార్దిక్ పాండ్య ప్లేస్ లోకి వస్తున్న మరో ఆల్ రౌండర్…ఇక ఇండియాని ఆపేవారు లేరు…

ఇప్పటికే నాలుగు విజయాలను అందుకొని న్యూజిలాండ్ టీం నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా, ఇండియన్ టీమ్ రెండవ పొజిషన్ లో ఉండేది.ఇక నిన్న ఇండియన్ టీం బంగ్లాదేశ్ మీద మ్యాచ్ గెలిచిన తర్వాత నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది.

Written By: Gopi, Updated On : October 20, 2023 2:37 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది.అందులో భాగం గా బంగ్లాదేశ్ టీమ్ ని చిత్తుగా ఓడించి ఇండియా ఘన విజయం సాధించింది. ఇక అందులో భాగంగానే బంగ్లాదేశ్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.దాంతో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీంకు ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ , శుభ్ మాన్ గిల్ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో ఇండియాకి మంచి ఓపెనింగ్ పత్నార్షిప్ అయితే చాలా గొప్పగా వచ్చిందనే చెప్పాలి.

ఇక తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఈ మ్యాచ్ ని గెలిపించడం మనం చూశాం… దీంతో ఈ వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా 4 వ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇప్పటికే నాలుగు విజయాలను అందుకొని న్యూజిలాండ్ టీం నెంబర్ 1 పొజిషన్ లో ఉండగా, ఇండియన్ టీమ్ రెండవ పొజిషన్ లో ఉండేది.ఇక నిన్న ఇండియన్ టీం బంగ్లాదేశ్ మీద మ్యాచ్ గెలిచిన తర్వాత నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంది. న్యూజిలాండ్ ఇండియా రెండు కూడా వరుసగా నాలుగు విజయాలను అందుకొని 8 పాయింట్లతో రెండు టీములు కూడా సమానంగా ఉన్నప్పటికీ ఇండియాకి నెట్ రన్ రెట్ ఎక్కువగా ఉండటం వల్ల నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.

ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కి గాయం అవ్వడం జరిగింది.ఇక ఇప్పుడు 22వ తేదీన న్యూజిలాండ్,ఇండియా టీంల మధ్య జరగాల్సిన మ్యాచ్ కి హార్థిక్ పాండ్యా ఉంటాడా..? లేదా..? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన గాయం తీవ్రతను బట్టి మ్యాచ్ లో ఉంటాడా లేదా అనేది అధికారికంగా బీసిసిఐ ప్రకటిస్తుంది.ఇక ఇప్పటి వరకు బీసీసీఐ హార్థిక్ పాండ్య గాయం మీద ఏ విధంగా స్పందించలేదు. ఇక రోహిత్ శర్మ కూడా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా కి గాయం తీవ్రత పెద్దగా లేదని అది ఎఫెక్ట్ అవ్వదని చెప్పాడు.

అయితే ఒకవేళ హార్దిక్ కి గాయం అయితే ఇప్పుడు ఎలా అని క్రికెట్ అభిమానులు తీవ్రమైన బాధకి గురి అవుతున్నారు. ఎందుకంటే టీం లో 11 మెంబర్స్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా సెట్ అయిపోయి ఉన్నారు.ఇక ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాకి గాయమవ్వడం వల్ల ఆయన కనక మ్యాచ్ ఆడకపోతే ఆయన ప్లేస్ లో ఏ ప్లేయర్ వస్తాడు ఆయన ఎలా ఆడతాడు అనే విషయాల మీద క్లారిటీ లేదు. కాబట్టి క్రికెట్ అభిమానులని ఈ విషయం తీవ్రంగా నిరాశ పరుస్తుంది. హార్థిక్ పాండ్యా కనక మ్యాచ్ ఆడకపోతే ఆయన ప్లేస్ లో అక్షర్ పటేల్ గాని లేదా శివం దూబే గాని ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నిజానికి శివం దూబే బ్యాటింగ్ ఒకటే బాగా ఆడుతాడు,బౌలింగ్ లో పెద్దగా మ్యాజిక్ ఏం చూపించడం లేదు.కాబట్టి అక్షర్ పటేల్ అయితే అన్ని విధాలుగా టీమ్ కి బాగా హెల్ప్ అవుతాడని భావించిన బిసిసిఐ హార్ధిక్ పాండ్య ఆడలేకపోతే ఆయన ప్లేస్ లో అక్షర్ పటేల్ ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి…