Now Jemima.. Then Gambhir: విలన్లు ప్రజలను తెగ ఇబ్బంది పడుతుంటారు. నరకం చూపిస్తుంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చితక బాదుతుంటారు. చూస్తున్న ప్రేక్షకులకు కోపం పెరుగుతుంది. కసి వస్తుంది. సీట్లో నుంచి లేచి విలన్లను కొట్టాలనిపిస్తుంది. అదిగో అదే సమయానికి హీరో ఎంట్రీ ఇస్తాడు. విలన్లను తుక్కుతుక్కు కొడుతుంటాడు. హీరో అలా కొడుతుంటే సీట్లో కూర్చున్న ప్రేక్షకులు ఈలలు వేస్తారు. హీరో పాత్రలో తమను ఊహించుకొని గట్టిగా అరుస్తుంటారు.. దీని సినీ పరిభాషలో హై మూమెంట్ అని పిలుస్తుంటారు. ఇలాంటి హై మూమెంట్ క్రికెట్లో అరుదుగా వస్తుంది.. అటువంటి మూమెంట్ గతంలో మెన్స్ క్రికెట్లో కన్పించేది.. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్లో జెమిమా రోడ్రిగ్స్ ఆ హై ని అభిమానులకు అందించింది.
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై జెమిమా రోడ్రిగ్స్ అదరగొట్టింది. సూపర్ సెంచరీ తో ఆకట్టుకుంది. ఈ సెంచరీ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. స్థానిక మీడియా, జాతీయ మీడియా లో జెమిమా రోడ్రిగ్స్ గురించి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. అందులో ఒక కథనం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఒక పోలిక మాత్రం గొప్పగా ఉంది.
ప్రస్తుతం టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నారు. ఆయన 2011 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఏకంగా 97 పరుగులు చేసి టీమ్ మీడియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సైతం జెమిమా రోడ్రిగ్స్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసింది. పైగా గౌతమ్ గంభీర్ మాదిరిగానే 5వ నెంబర్ జెర్సీ ధరించింది. ఇద్దరు జెర్సీలకు కూడా బ్యాటింగ్ చేసే క్రమంలో మట్టి అంటింది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా విపరీతమైన వాడకంలో ఉండడంతో అభిమానులు నాటి రోజులను.. నేటి రోజులను అనుసంధానం చేస్తూ గౌతమ్ గంభీర్, జెమిమా రోడ్రిగ్స్ పోల్చుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం జెమిమా రోడ్రిగ్స్, గౌతమ్ గంభీర్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.