Siraj : ఆధునిక క్రికెట్ లో బుమ్రా, సిరాజ్ వేగంగా బౌలింగ్ వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వారి కంటే అత్యంత వేగంగా బంతులు వేసే బౌలర్ మాత్రం భువనేశ్వర్ కుమార్. టీమిండియాలో అతడు ఆడక చాలా రోజులు అయినప్పటికీ.. అతడి ఏకంగా 201, 208 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేసేవాడు. 2022 ఐర్లాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్ లో ఈ విషయం వెలుగు చూసింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేస్తున్న సమయంలో స్పీడ్ గన్ 201, 208 కిలోమీటర్ల స్పీడు నమోదయింది. వాస్తవానికి భువనేశ్వర్ కుమార్ నిదానంగానే బౌలింగ్ వేస్తాడు. బంతిని విసిరే క్రమంలో వేగంగా వేస్తాడు. అయితే అప్పుడు స్పీడ్ గన్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అత్యధిక వేగంతో బంతులు వేసినట్టు చూపించింది. ఆ సంఘటన తర్వాత సిరాజ్ కాదు, భువనేశ్వర్ కుమారే అత్యంత వేగంతో బంతులు వేస్తాడని అప్పట్లో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్ చల్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న మ్యాచ్లో సిరాజ్ సరికొత్త ఘనత సృష్టించాడు. పింక్ బాల్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో సిరాజ్ దూకుడుగా బౌలింగ్ చేశాడు. అతడు విసిరిన బంతి 181.6 కిలోమీటర్ల వేగంతో దూసుకు వచ్చిందని.. స్పీడ్ గన్ లో రికార్డ్ అయింది. అయితే అందులో సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25 ఓవర్లో సిరాజ్ విసిరిన బంతి ఏకంగా 181.6 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకు వచ్చిందని స్పీడ్ గన్ లో రికార్డ్ అయింది.. అయితే 181.6 కిలోమీటర్ల స్పీడ్ తో ఎలా వేశాడని ఫ్యాన్స్ ఒకసారి గా షాక్ అయ్యారు. అయితే ఇది నిజం కాదని, స్పీడ్ గన్ లో లోపం వల్ల జరిగిందని తెలుస్తోంది.
వేగంగా వేసింది అతడే
క్రికెట్లో అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్ గా షోయబ్ అక్తర్ పేరుమీద రికార్డు ఉంది. షోయబ్ తను సంధించే బంతిని విపరీతమైన వేగంతో వేసేవాడు. 2003 వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరేశాడు. క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డ్ సృష్టించింది. ఇంతవరకు మరే బౌలర్ కూడా ఈ ఫీట్ అందుకోలేకపోయాడు. అంతటి వేగంలోనూ షోయబ్ అక్తర్ బంతిపై నియంత్రణ కలిగి ఉండేవాడు. కొన్ని కొన్ని సార్లు లయ కోల్పోయి వైడ్ లేదా నోబ్ గా వేసేవాడు.
Siraj bowled 181 km/hr …. fox is high pic.twitter.com/vrRsSsW25d
— Kifayat Malik (@KifayatMalik176) December 6, 2024