MS Dhoni: ఇండియన్ క్రికెట్ అంటే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని ఈయన ఇండియన్ టీం కి చాలా విజయాలను అందించడమే కాకుండా ఇండియన్స్ అయిన మన ఆత్మ గౌరవాన్ని కూడా ప్రపంచం మొత్తం చాటి చెప్పేలా చేశారు.ఇక దానికి తోడు గా ఐసీసీ నిర్వహించే అన్ని కప్పులను సాధించిన ఇండియన్ కెప్టెన్ గా కూడా ధోని ఒక రికార్డు క్రియేట్ చేశారు.ఇక ధోని లాంటి ప్లేయర్ ని చూసి ప్రపంచ దేశాల కెప్టెన్ లు సైతం భయపడి పోయారు అంటే మాములు విషయం కాదు నిజానికి ధోని లాంటి ఒక గొప్ప కెప్టెన్ ఇండియా లో ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి…ఆయన గ్రౌండ్ లో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి టీం లకి వెన్నులో వణుకు పుడుతుంది.ఆయన ఒక గొప్ప కెప్టెన్, ఆయన ఒక విధ్వంసకరమైన బ్యాట్స్ మెన్…అలా ధోని గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది…
ఇక అసలు విషయం లోకి వస్తే కింగ్ కోహ్లీ హెల్మెట్ మీద మన జాతీయ జెండా ఉంటుంది.కానీ ధోని హెల్మెట్ మీద జెండా ఏం ఉండదు. కారణం ఏంటి అనే ఆలోచన మనలో చాలా మంది కి వచ్చి ఉంటుంది.దాని వెనక ఉన్న అసలు విషయం ఏంటి అంటే మన దేశం యొక్క గౌరవాన్ని మనం తివర్ణ పథకం లో చూసుకుంటాం కాబట్టి అలంటి ఒక గొప్ప దేశ గౌరవానికి గుర్తుగా ఉన్న జెండా ని ఒక గొప్ప కెప్టెన్ అయినా ధోని హెల్మెట్ మీద ఎందుకు లేదు అంటే ఆయన వికెట్ కీపర్ గా కూడా చేస్తాడు కాబట్టి కీపింగ్ చేసే టైం లో కొన్ని సార్లు హెల్మెట్ పెట్టుకుంటారు మరికొన్ని సార్లు తీసివేస్తారు. కాబట్టి అలాంటి సమయం లో హెల్మెట్ ని కీపర్ వెనకాల నేల మీద పెట్టాల్సి ఉంటుంది.కాబట్టి ఇలాంటి టైం లో దేశం యొక్క జెండా గౌరవాన్ని మనం కించ పరిచినట్టు గా అవుతుందని అలాగే ఆ హెల్మెట్ కి బ్యాట్స్ మెన్స్ కొట్టినపుడు బాల్స్ కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయని ధోని అలా తన హెల్మెట్ మీద మన జాతీయ జెండా ని వేయించుకోకుండా నార్మల్ హెల్మెట్ నే వాడుతుంటారు…
నిజానికి ధోని కి దేశం అంటే ఎంత ఇష్టమో మనం ఈ ఒక్క సంఘటన ని చూసి అర్థం చేసుకోవచ్చు.నిజానికి ధోని ఇప్పటికి కూడా ఆర్మీ లో లెఫ్టనెంట్ కల్నల్ గా కూడా ఉంటూ దేశం మీద తన ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాడు.ఇక తాను క్రికెటర్ కాకపోయి ఉంటె ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని అయ్యేవాన్ని అని ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది.ఇలా ఇండియన్ టీం మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అవకాశం దొరికిన ప్రతి సారి మన దేశం మీద తన ఇష్టాన్ని చూపిస్తూ వస్తున్నాడు…
ఇక ప్రస్తుతం ధోని ఇండియన్ టీం లో లేకపోవడం వల్ల చాలా మంది ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆయన ఆట ని చాలా వరకు ఆయన ఆటని మిస్ అయిపోతున్నారు.దానికోసమే ప్రతి ఇండియన్ మ్యాచ్ జరిగేటప్పుడు అభిమానులు మిస్ యూ ధోని అంటూ ఫ్లక్ కార్ట్ లు పట్టుకొని వల్ల అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు…నిజానికి ధోని టీం లో ఉంటె ఆ వైబ్రేషన్స్ వేరేలా ఉంటాయి అని ఇప్పటికే చాలా మంది ఇండియన్ ప్లేయర్లు సైతం వాళ్ల అభిప్రాయాలను చాలా సార్లు వ్యక్తం చేశారు…