https://oktelugu.com/

Nitish Kumar Reddy: ఎత్తుకొని.. లాలించి.. బుజ్జగించి.. కొత్త వ్యక్తిని పరిచయం చేసిన నితీష్ కుమార్ రెడ్డి!

Nitish Kumar Reddy : తెలుగు క్రికెట్ అభిమానులకు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లో నితీష్ కుమార్ రెడ్డి కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Written By: , Updated On : April 1, 2025 / 09:43 PM IST
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Follow us on

Nitish Kumar Reddy : గత ఐపిఎల్ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యాడు. దీంతో ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. దీంతో ట్రోఫీని కోల్పోయింది. ఐపీఎల్ లో సాధించిన సత్తా ఆధారంగా నితీష్ కుమార్ రెడ్డి కి భారత జాతీయ క్రికెట్ జట్టులో స్థానం లభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (BGT) నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. మెల్ బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అప్పటినుంచి నితీష్ కుమార్ రెడ్డికి ఫ్యాన్ క్రేజ్ మరింత పెరిగింది. అతడు ఒక్కసారిగా స్టార్ ఆటగాడిగా మారిపోయాడు.. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతడికి అవకాశం లభించకపోయినప్పటికీ.. టి20 మ్యాచ్ లలో మాత్రం స్థిరంగా అవకాశాలు లభిస్తున్నాయి. టి20 లలో నితీష్ కుమార్ రెడ్డి తనను తాను నిరూపించుకున్నాడు.

Also Read : కోహ్లీ షూ అంటే అట్లుంటది.. దెబ్బకు నితీష్ సెంచరీ

కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు

ఇటీవల ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ లైన్ వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ చేస్తుండగా.. గ్యాలరీలో కూర్చున్న అభిమానులు “బ్రో పెళ్లి ఎప్పుడు.. అమ్మాయిలు మొత్తం నువ్వంటే పడి చచ్చిపోతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా” అని అడిగితే.. లవ్ మ్యారేజ్ అని అడిగితే నితీష్ కుమార్ రెడ్డి అడ్డంగా తల ఊపాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని సంకేతాలిచ్చాడు.. అయితే అభిమానులు అదేపనిగాఅ అడుగుతుండడంతో నితీష్ కుమార్ రెడ్డి మొహమాటం కొద్ది ఆ మాట అన్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు.. ఎత్తుకున్నాడు.. లాలించాడు.. ముద్దులు పెట్టుకున్నాడు.. ఇంతకీ ఎవరు ఆ కొత్త వ్యక్తి అనే ప్రశ్న మీలో మెదులుతోంది కదా.. ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదు.. నితీష్ కుమార్ రెడ్డి పెంచుకుంటున్న శునకం. ఆ శునకం పేరు ZORO. ఆ శునకాన్ని ఎత్తుకొని నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడా లేని ఆనందాన్ని పొందాడు. విపరీతమైన ఉత్సాహాన్ని ఆస్వాదించాడు. ” అందరూ మా కుటుంబంలో సభ్యుడికి హాయ్ చెప్పండి అంటూ” నితీష్ కుమార్ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు.. ఆ ఫొటోలతో పాటు వీడియోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు..