Nitish Kumar Reddy: రాజస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఒక సంఘటన జరిగింది. మ్యాచ్ మధ్యలో ప్రేక్షకులు పదేపదే అడగగా.. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన పెళ్లిపై ఒక స్పష్టత ఇచ్చాడు.. రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ లైన్ వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతడి వెనకాల స్టాండ్స్ లో కూర్చున్న అభిమానులు.. మాట్లాడేందుకు ప్రయత్నించారు. ” బ్రో మ్యారేజ్ ఎప్పుడు.. అమ్మాయిలు చచ్చిపోతున్నారు.. లవ్ మ్యారేజా” అని నితీష్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి నితీష్ కుమార్ రెడ్డి లోలోపల సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత తనలో తాను నవ్వుకున్నాడు. లవ్ మ్యారేజా అని ప్రేక్షకులు అడిగితే.. కాదు అన్నట్టుగా తల ఊపి సైగలు చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
Also Read: పిచ్చెక్కి పిచ్చకొట్టుడు కొట్టాలి.. అదే SRH ప్లాన్.. వైరల్ వీడియో!
కొద్దిరోజులు బతకనివ్వండి
ఈ వీడియోని చూసిన చాలామంది అభిమానులు నితీష్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు..” నితీష్ కుమార్ రెడ్డికి అప్పుడే వయసు అయిపోలేదు కదా.. కొద్దిరోజులు అతడిని బతకనివ్వండి.. కెరియర్ ఈ మధ్యనే మొదలుపెట్టాడు కదా.. అప్పుడే పెళ్లి అని ఇబ్బంది పెడతారు ఎందుకు.. గత ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ తో ఆకట్టుకున్నాడు. టి20 లలో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఎన్నో కష్టాలు పడి ఇక్కడదాకా వచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి కెరియర్ కోసం అతడి తండ్రి చాలా త్యాగాలు చేశాడు. హిందుస్థాన్ జింక్ కంపెనీలో ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. అతని కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తిని ఇంకా ఎదగాలి అని కోరుకోవాలి. తెలుగుజాతి పౌరుషాన్ని.. గౌరవాన్ని పెంచాలని అనుకోవాలి. అంతే తప్ప ఇప్పుడే పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టకూడదు. మన తెలుగు తేజం ఓ రేంజ్ లో ఉన్న తర్వాత.. గర్వపడాలి గాని.. ఇలా చేయడం ఏంటని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అని ప్రేక్షకులు అడిగి… దానికి లేదు అని నితీష్ కుమార్ రెడ్డి బదులిచ్చాడు అంటే.. అరేంజ్ మ్యారేజ్ కే అతడు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే సిగ్గుపడుతూ తన నిర్ణయాన్ని అతడు వ్యక్తం చేసినట్టు సన్ రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తన పెళ్లికి సంబంధించి ఒక్క మాట కూడా బయట పెట్టకుండానే… సిగ్గుపడుతూ, తల ఊపుతూ సమాధానం చెప్పిన నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో తన ఆట తీరు మార్చుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కీలక ఆటగాడిగా మారాడు.
Bro Marriage eppudu bro #NitishKumarReddy pic.twitter.com/pUmbDM44Ez
— Movies4u Official (@Movies4u_Officl) March 24, 2025