Homeక్రీడలుక్రికెట్‌Nitish Kumar Reddy: ఇష్టమైన హీరో కోసం ₹4 కోట్ల కారు కొన్న నితీష్ కుమార్...

Nitish Kumar Reddy: ఇష్టమైన హీరో కోసం ₹4 కోట్ల కారు కొన్న నితీష్ కుమార్ రెడ్డి

Nitish Kumar Reddy: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్ర మహర్దశ కొనసాగుతోంది. ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి వికెట్లు తీశాడు. చెన్నై జట్టు ఓటమిని శాసించాడు. బంతితో మాత్రమే కాకుండా, బ్యాట్ తో కూడా నితీష్ అదరగొట్టాడు.. ఫలితంగా అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున హీరో అయిపోయాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాడిగా రూపాంతరం చెందాడు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా.. నితీష్ కుమార్ రెడ్డి తనకు ఉన్న ఫేమ్ తో భారీగానే సంపాదిస్తున్నాడు. హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న అతడు.. ఫీజు రూపంలో దండిగానే వెనకేసుకుంటున్నాడు. వచ్చిన డబ్బులతో ఆస్తులను కొనుగోలు చేస్తున్న అతడు.. తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అది కాస్త అతడిని సోషల్ మీడియాలో.. మీడియాలో మరోసారి ప్రముఖంగా నిలిచేలా చేసింది.

నితీష్ కుమార్ రెడ్డి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. రేంజ్ రోవర్ కంపెనీ చెందిన కారును అతడు పర్చేజ్ చేశాడు. ఈ కారు విలువ 3.83 కోట్ల నుంచి 4.83 కోట్ల వరకు ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్ కొనుగోలు చేశాడు. మహేష్ బాబుకు నితీష్ వీరాభిమాని. అందువల్లే అతడు వాడుతున్న కారును కొనుగోలు చేశాడు. అదే రంగు ఉండేలా చూసుకున్నాడు. నితీష్ మిడిల్ ఆర్డర్లో స్థిరంగా బ్యాటింగ్ చేయగలడు. అదే సమయంలో బౌలింగ్ కూడా అద్భుతంగా వేయగలడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు నితీష్. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా నితీష్ సత్తా చూపించాడు. దీంతో అతని మీద మేనేజ్మెంట్ కు మరింత బలమైన నమ్మకం ఏర్పడింది.

నితీష్ కారు కొనుగోలు చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ” శభాష్ నితీష్.. కోట్లు పెట్టి కారు కొనుగోలు చేశావు. త్వరలో ఆ శుభవార్త కూడా మాకు చెప్పేసేయ్. మీ జంటకు ఆశీర్వాదాలు అందించి.. శుభాకాంక్షలు తెలియజేస్తామని” సోషల్ మీడియాలో అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular