Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Release Date: 'డ్రాగన్' విడుదల తేదీని ప్రకటించిన ఎన్టీఆర్.. టీజర్ ఎప్పుడంటే..

NTR Dragon Release Date: ‘డ్రాగన్’ విడుదల తేదీని ప్రకటించిన ఎన్టీఆర్.. టీజర్ ఎప్పుడంటే..

NTR Dragon Release Date: అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఎన్టీఆర్(Junior NTR) ‘డ్రాగన్'(Dragon Movie) మూవీ అప్డేట్ వచ్చేసింది. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం కుదిరి ఉండుంటే ఈ చిత్రం ఈ ఏడాది జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ రావడం తో విడుదల తేదీని ప్రకటించలేకపోయారు మేకర్స్. అయితే నేడు ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ […]

NTR Dragon Release Date: అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఎన్టీఆర్(Junior NTR) ‘డ్రాగన్'(Dragon Movie) మూవీ అప్డేట్ వచ్చేసింది. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం కుదిరి ఉండుంటే ఈ చిత్రం ఈ ఏడాది జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ రావడం తో విడుదల తేదీని ప్రకటించలేకపోయారు మేకర్స్. అయితే నేడు ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ , ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా , అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు.

ముందుగా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సరిపెట్టాలని అనుకున్నారు కానీ , అభిమానుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడం తో గ్లింప్స్ వీడియో ని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు మేకర్స్. ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం తో ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దానికి తోడు బలమైన కంటెంట్ ని కూడా విడుదల చేస్తే, ఇక ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుతాయి. పోస్టర్ ని చూస్తుంటే , ఇది కూడా ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్ , సలార్ తో పోలినట్టు గా అనిపిస్తోంది. ఇది తన నెల , తన రాజ్యం అంటూ ఎన్టీఆర్ ఒక క్యాప్షన్ పెడుతాడు. అంటే ఇందులో ఆయన మాఫియా సామ్రాజ్యానికి అధినేత గా కనిపించబోతున్నాడా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

మరి కొంతమంది అయితే , ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజం అనే క్లారిటీ రావాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. ఆరోజు గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తారు కాబట్టి, ఈ సినిమాని ఎలాంటి స్టోరీ తో తెరకెక్కిస్తున్నారు అనే విషయం అర్థం అవ్వుద్ది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తోంది. విలన్ క్యారక్టర్ కోసం పలువురి యంగ్ హీరోలను సంప్రదిస్తున్నారు మేకర్స్. అత్యధిక శాతం రీ షూట్స్ జరుగుతూ ఉండడం తో , వచ్చే ఏడాది జూన్ లో కూడా ఈ సినిమా విడుదల కష్టమే అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper