https://oktelugu.com/

Prashant Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పై ‘హనుమాన్’ హీరోయిన్ సెటైర్లు..ఇంస్టాగ్రామ్ లో బండారం మొత్తం బయటపెట్టేసిందిగా!

ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన 'హనుమాన్' చిత్రం సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 07:30 PM IST

    Prashant Varma

    Follow us on

    Prashant Varma : ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఒక చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా అని ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టిన క్షణాలు అవి. ఎదురుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రం ఉంది. బయ్యర్స్ మొత్తం ఆ సినిమాకి థియేటర్స్ కేటాయించడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి సెంటర్స్ లో కూడా ‘హనుమాన్’ కి మెయిన్ థియేటర్స్ దొరకని పరిస్థితి. అలాంటి రేంజ్ నుండి ‘గుంటూరు కారం’ చిత్రాన్ని కూడా ఆడియన్స్ మర్చిపోయే రేంజ్ లో ఈ చిత్రం సునామీ ని సృష్టించి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టింది.

    ఈ చిత్రం తో తేజ సజ్జ పాన్ ఇండియన్ హీరో గా మారిపోయాడు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన అమృత అయ్యర్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె ప్రదీప్ హీరో గా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ తర్వాత ‘హనుమాన్’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది. ఈమె ఆ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం కచ్చితంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మనే. అలాంటి ప్రశాంత్ వర్మ గురించి ఈమె లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నందమూరి అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

    అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని, తన అసిస్టెంట్ తో సినిమా చెయ్యిస్తున్నాడని, బాలయ్య చేతిలో దెబ్బలు కూడా తిన్నాడని ఇలా పలు రకాల పుకార్లు షికార్లు చేసాయి. దీనికి సంబంధించిన మీమ్ ని హీరోయిన్ అమృత అయ్యర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన తర్వాత కచ్చితంగా ఈమెకు, ప్రశాంత్ వర్మ కి మధ్య ఎదో గొడవ జరిగింది. అందుకే ఆమె ఇలా చేసింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘బచ్చలమల్లి’ ప్రోమోషన్స్ లో కూడా హనుమాన్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అప్పట్లో ఈమె ‘హనుమాన్’ మూవీ ప్రోమోషన్స్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. దీని గురించి ఇంటర్వ్యూ లో అడిగితె ‘నేను వేరే మూవీ షూటింగ్ లో ఉండడం వల్ల హనుమాన్ ప్రోమోషన్స్ లో పాల్గొనలేదు’ అని చెప్పుకొచ్చింది.