Nita Ambani
Nita Ambani: నీతా అంబానీ( Neeta Ambani) లక్షల కోట్ల విలువైన రిలయన్స్ (Reliance industries) సామ్రాజ్యానికి చైర్ పర్సన్. ముఖేష్ అంబాని(Mukesh Ambani)కి అదృష్ట దేవత. ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు చైర్ పర్సన్.. ఇంకా రిలయన్స్ కంపెనీ చేపట్టే సామాజిక కార్యక్రమాలకు అధిపతి.. అందుకే నీతా అంబాని అంటే కార్పొరేట్ ప్రపంచంలో ప్రత్యేకమైన వ్యక్తి.
ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians team) ఎంపిక విషయంలో నీతా అంబానీ ముఖ్యపాత్ర పోషిస్తారు. ఆకాశ్ అంబానీ ముంబై ఇండియన్స్ నిర్వహణను పరిశీలిస్తున్నప్పటికీ.. అతడికి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే బాధ్యత మాత్రం నీతా అంబానీదే. అందువల్లే ముంబై జట్టు ఆడే మ్యాచ్ లకు కచ్చితంగా ఆమె హాజరవుతారు. ముంబై జట్టు ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అత్యంత విజయవంతమైన జట్టుగా ప్రశంసలు అందుకుంటున్నది. అయితే ఈ జట్టు గత సీజన్లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించలేదు. అయితే ఈసారి జట్టులో మార్పులు, చేర్పులను నీతా అంబానీ స్వయంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా వేలంలో ఆమె చెప్పిన ఆటగాళ్లనే ఆకాశ్ అంబానీ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఎంతో సౌమ్యంగా.. ఆచి తూచి మాట్లాడే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా జట్టు నర్సరీ లాంటిది
ముంబై జట్టు గురించి సమయం దొరికినప్పుడల్లా నీతా అంబానీ గొప్పగా చెబుతుంటారు.. తాము కొనుగోలు చేసిన జట్టు ఈ స్థాయిలో ఉందంటే అది గర్వకారణం గా ఉందని వ్యాఖ్యానిస్తుంటారు.. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ముంబై ఇండియన్స్ జట్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో టీమిండియా కు నర్సరీగా ముంబై ఇండియన్స్ జట్టు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. హార్దిక్ పాండ్యా సోదరులను, బుమ్రా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి దేశం గర్వించే ఆటగాళ్లను తమ జట్టు తీసుకొచ్చిందని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. 2017లో తమ పది లక్షలకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేశామని.. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడని నీతా వ్యాఖ్యానించారు.. 2016లో తన శరీర సామర్థ్యం భిన్నంగా ఉన్న బుమ్రా ను గుర్తించామని.. అతడు ఇప్పుడు టాప్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. తిలక్ వర్మ ప్రస్తుతం t20 లలో సంచలన ఆటగాడిగా పేరుపొందాడని.. అతడికి కూడా తామే అవకాశాలు ఇచ్చామని నీతా పేర్కొన్నారు. ఇంతటి గొప్ప ఆటగాళ్లను తాము టీమిండియాకు అందించామని.. అందువల్లే టీమిండియా క్రికెట్లో ఈరోజు ఈ స్థానంలో ఉందని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. టీమిండియాకు మేలి రకమైన ఆటగాళ్లను అందించే నర్సరీగా ముంబై ఇండియన్స్ జట్టు మారిపోయిందని ఆమె వివరించారు.. నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జట్టు పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ” ఆటగాళ్ల సామర్థ్యం తో పాటు.. ముంబై జట్టు మేనేజ్మెంట్ సహకారం కూడా తోడైంది. అందువల్లే ముంబై ఆటగాళ్లు టీమిండియాను లీడ్ చేస్తున్నారు. కాకపోతే తన జట్టు గురించి చెప్పే క్రమంలో.. లోపాల గురించి కూడా వివరించి ఉంటే నీతా హుందాతనం మరో స్థాయికి వెళ్లేది. కేవలం ముంబై జట్టు మాత్రమే కాదు.. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా టీమిండియాలో ఆడుతున్నారు. వారికి కూడా ప్రోత్సాహాలు లభించాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నారని” నెటిజన్లు పేర్కొంటున్నారు.