Nicholas Pooran Poor Performance: ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కోట్లకు కోట్లు పెట్టి యాజమాన్యాలు ప్లేయర్లను కొనుగోలు చేసినప్పుడు.. వారు ఆటకు న్యాయం చేయాలి. తమ శక్తివంచన లేకుండా ఆడి.. అదరగొట్టాలి. అలా ఆడే ఆటగాళ్లకు ఐపీఎల్లో విపరీతమైన క్రేజీ ఉంటుంది. అనేక రూపాలలో డబ్బు లభిస్తూ ఉంటుంది. పేరు, కీర్తి కోసమే ఏ ఆటగాడు అయినా క్రికెట్ ఆడేది. కానీ ఐపీఎల్ లో ఈ ఆటగాడు మాత్రం ఆడుతున్న తీరు అత్యంత చెత్తగా ఉంది. అసలు అతను మైదానంలోకి వస్తున్నాడు అంటేనే ఆ జట్టు అభిమానులకు ఇబ్బందికరంగా ఉంది.
లక్నో జుట్టు తరఫున నికోలస్ పూరన్ ఆడుతున్న ఆట చూస్తే ఇబ్బందికరంగా ఉంది. గల్లి స్థాయిలో ఆడుతున్నట్టుగా అతని ప్రదర్శన ఉంది. దీంతో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక తల పట్టుకుంటున్నాడు. ఇప్పటికే లక్నో జట్టు వరుస ఓటములు ఎదుర్కోవడంతో పాయింట్లు పట్టికలో దిగువ స్థానంలో ఉంది.. బుధవారం మరో ఓటమి ఎదుర్కోవడంతో ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా మారింది. కీలక ప్లేయర్లు నిరాశ జనకమైన ప్రదర్శన చేశారు. ప్లేయర్లు వెంటబెటనే అవుట్ కావడంతో రంగంలోకి దిగాడు నికోలస్ పూరన్.. చివరికి అతడు కూడా నిరాశపరచడంతో లక్నో జట్టుకు ఓటమి తప్పలేదు.
నికోలస్ అద్భుతమైన ఆటగాడు. వెస్టిండీస్ జట్టు తరఫున సంచలన ఇన్నింగ్స్ లు ఆడాడు. అందువల్లే అతడిని 21 కోట్లు పెట్టి లక్నో జట్టు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన నికోలస్.. కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 22.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 9.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒకటి.. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 19, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో 13, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ఒకటి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 పరుగులు చేశాడు. ఇతడు స్ట్రైక్ రేట్ కేవలం 82 మాత్రమే ఉంది.
గత సీజన్లో ఇతడు 196 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 524 పరుగులు చేశాడు. ఇందులో 40 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో మాత్రం అతడు కేవలం 3 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. పిచ్ లోకి రావడం.. వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో లక్నో యాజమాన్యం తలలు పట్టుకుంది. 21 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలా ఆడుతున్నాడు ఏంటని లక్నో అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.