Nicholas Pooran: హరీష్ ఉత్తమన్ ఇచ్చిన ఎలివేషన్ మాదిరిగానే.. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow super giants) నికోలస్ పూరన్(Nicholas pooran) ఆడాడు. మామూలుగా కాదు.. పూనకం వచ్చినట్టు కొట్టాడు.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. కేవలం 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు గుజరాత్ జట్టు విధించిన 180 పరుగుల లక్ష్యాన్ని నికోలస్ పూరన్ లక్నో జట్టు సులువుగా చేదించేలాగా చేశాడు. ఫలితంగా లక్నో జట్టు ఈ సీజన్లో వరుసగా మరో విజయాన్ని సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది..
Also Read: చరిత్ర సృష్టించిన గిల్, సాయి సుదర్శన్
గొప్పగా బ్యాటింగ్ చేసినప్పటికీ..
ఈ మ్యాచ్లో ముందుగా గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు గిల్(60), సాయి సుదర్శన్ (56)హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్ కు 12.1 ఓవర్లలో 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత గిల్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 122 పరుగుల వద్దకు చేరుకోగానే సాయి సుదర్శన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్(16), వాషింగ్టన్ సుందర్ (2), షారుక్ ఖాన్ (11), రాహుల్ తేవాటియ(0) వెంట వెంటనే అవుట్ కావడం.. రూథర్ఫర్డ్ ( 22) దూకుడుగా ఆడినప్పటికీ.. అతడికి అండగా మరో బ్యాటర్ లేకపోవడంతో గుజరాత్ జట్టు ఆరు వికెట్ నష్టానికి 180 పరుగులు చేసింది.
పూరన్ విధ్వంసం
181 పరుగుల విజయ లక్ష్యం తో రంగంలోకి దిగిన లక్నో జట్టు ఏ దశలోనూ ఓడిపోయేలాగా కనిపించలేదు. ఓపెనర్లు మార్క్రం(58), రిషబ్ పంత్ (21) తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. ఆ తర్వాత రిషబ్ పంత్ అవుట్ కావడంతో.. నికోలస్ పూరన్ వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 61 పరుగులు చేశాడు. అతని విధ్వంసానికి ఆయుష్ బదోని (28) తోడు కావడంతో లక్నో జట్టు 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఆకాశమే హద్దుగా
ఇక ఈ సీజన్లో నికోలస్ పూరన్ పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 30 బంతుల్లో 75 పరుగులు, రెండో మ్యాచ్లో 26 బంతుల్లో 70 పరుగులు, మూడో మ్యాచ్లో 30 బంతుల్లో 44 పరుగులు, నాలుగో మ్యాచ్లో 6 బంతుల్లో 12 పరుగులు, ఐదో మ్యాచ్లో 36 బంతుల్లో 87*, ఆరో మ్యాచ్లో 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు పూరన్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో 18, 21, 23, 24 బంతులు ఎదుర్కొని నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఫలితంగా ఐపీఎల్లో తనకు తానే సాటని.. విధ్వంసానికి తానే పోటీ అని నిరూపించుకున్నాడు.