GT Vs LSG: ఐపీఎల్ (IPL) 18వ ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కు ఎదురులేకుండా పోతుంది. అప్రతిహత విజయాలతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో తిరుగులేని స్థానంలో ఉంది. ఈ జట్టులో సాయి సుదర్శన్(Sai Sudarshan), శుభ్ మన్ గిల్(shubman Gil) కీలకంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్లో వీరిద్దరూ నిలకడైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు.. జట్టుకు బలమైన స్కోర్ అందిస్తున్నారు. పటిష్టమైన పునాదులు వేస్తున్నారు. ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ ఆరు మ్యాచులు ఆడగా.. నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతనికి పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు..ఇక చివరి మూడు మ్యాచ్లలో రెండు హాఫ్ సెంచరీలు చేసి గిల్ కూడా లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ జాబితాలో అతడు ఆరు స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత సీజన్లో అద్భుతమైన ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్, గిల్ లక్నో జట్టుతో (ఏప్రిల్ 12న) జరిగిన మ్యాచ్లో రెండు రికార్డులను నెలకొల్పారు. ఈ మ్యాచ్లో ఏకంగా తొలి వికెట్ కు 120 పరుగులు జోడించి సాయి సుదర్శన్, గిల్ జోడి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తొలి వికెట్ కు 100కు పైగా రన్స్ జోడించిన తొలి ద్వయంగా సాయి సుదర్శన్, గిల్ రికార్డు నెలకొల్పారు.. సీజన్లో ఏ వికెట్ కైనా కూడా అత్యధిక పరుగులు జోడించిన ద్వయంగా సాయి సుదర్శన్, గిల్ చరిత్ర సృష్టించారు.
Also Read: ధోని వచ్చినా.. చెన్నై మరింత చెత్తగా.. ఇంత ఘోరమైన రికార్డులా..
ఈ సీజన్లో అత్యుత్తమ భాగస్వామ్యాలు ఇవే..
సాయి సుదర్శన్, గిల్ తొలి వికెట్ కు 120 పరుగులు..
నికోలస్ పూరన్, షాన్ మార్ష్ 116 పరుగులు.. రెండో వికెట్ కు..
స్టబ్స్, కేఎల్ రాహుల్ 111* పరుగులు.. ఐదో వికెట్ కు..
సంజు శాంసన్, ధృవ్ జూరెల్ 111 పరుగులు.. నాలుగో వికెట్ కు..
అజింక్యా రహానే, సునీల్ నరైన్ 103 పరుగులు.. రెండో వికెట్ కు..
ఇవే హైయెస్ట్ భాగస్వామ్యాలు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ కొనసాగుతున్నారు. వీరిద్దరూ బెంగళూరు జట్టు తరుపున తొలి వికెట్ కు అద్భుతమైన భాగస్వామ్యాను నెలకొల్పారు.
2016లో గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ తొలి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2017లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఎబి డివిడియర్స్ తొలి వికెట్ కు 215* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2022లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ 210* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సాయి సుదర్శన్, గిల్ తొలి వికెట్ కు 210 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గిల్ క్రిస్ట్, షాన్ మార్ష్ తొలివికెట్ కు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
గిల్, సాయి ఆధ్వర్యంలో 648 పరుగులు..
గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ జోడిగా గడచిన తొమ్మిది మ్యాచ్లో 648 పరుగులు చేశారు..రన్ రేట్ 9.55 గా నమోదు చేశారు.. గడిచిన తొమ్మిది మ్యాచ్లలో 54, 64, 210, 61, 78, 32, 15, 14, 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.