Next BCCI President : భారత క్రికెట్ సంఘం 2022 నుంచి రోజర్ బిన్నీ పనిచేస్తున్నారు. గతంలో ఆయన టీమిండియా క్రికెట్లో చెరగని ముద్రవేశారు. జాతీయ జట్టుకు ఆడి సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశారు. ఇక ఈ ఏడాది జూలై 19న ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాలు నిండుతాయని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 70 సంవత్సరాలు నిండిన తర్వాత బీసీసీఐ అధికారులు వారు అనుభవిస్తున్న పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇంకా రెండు నెలల తర్వాత పదవికి రాజీనామా చేసే అవకాశం ఉండడంతో రోజర్ బిన్నీ తర్వాత బీసీసీఐకి అధ్యక్షుడు ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంది. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ ప్రశ్న విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.. రోజర్ బిన్నీ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెట్ మరింత అభివృద్ధి సాధించింది. అన్నింటికీ మించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ కోరుకున్నది జరిగింది. దయాది దేశంలో భారత్ అడుగుపెట్టలేదు. పిఓకే లో ఛాంపియన్ ట్రోఫీ ప్రదర్శన సాధ్యం కాలేదు. పాకిస్తాన్ గడ్డపై భారత జెండా ఎగిరింది.
Also Read : గోల్డ్ అండి… గోల్డ్.. అయ్యర్ బ్యాటింగ్ కు అంబానీల ముఖాలైనా వాడిపోల్సిందే! వైరల్ వీడియో!
కాబోయే అధ్యక్షుడు ఎవరంటే
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడుగా రాజీవ్ శుక్లా కొనసాగుతున్నారు. ఒకవేళ ఆయన నూతన అధ్యక్షుడిగా పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజీవ్ శుక్లాకు జై ష అండదండలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే శుక్లాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..” మరో రెండు నెలల్లో రాజీవ్ శుక్లా పదవీకాలం ముగిస్తుంది. జూలై 19న బిన్నీ పదవి కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత బోర్డు ఆమోదం మేరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికవుతారని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిసిసిఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజీవ్ శుక్లా గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. భారత జట్టుతో ఆయనకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉంది. బిసిసిఐ లో అనేక హోదాలలో ఆయన పని చేశారు. ప్లేయర్లతో కూడా ఆయనకు మంచి సంబంధం కలిగి ఉంది. పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియంలో కచ్చితంగా అందుబాటులో ఉంటారు. పైగా ప్లేయర్లు కూడా ఆయన నాయకత్వాన్ని ఇష్టపడుతుంటారు. అందువల్లే ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
దేశీయ టోర్నీల నిర్వహణలో.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో రాజీవ్ శుక్లా ముందుంటారని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుంది. వివాద రహితుడుగా, అజాత శత్రువుగా ఆయన పేరు తెచ్చుకున్నారు.. బీసీసీఐ అధ్యక్షుడిగా అతడిని గనక ఎంపిక చేస్తే ఆ పదవికి వన్నె తెచ్చినట్టు అవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతని వల్ల మేనేజ్మెంట్లో రాజకీయాల జోక్యం తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.