https://oktelugu.com/

Aus vs NZ: T20 world cupలో సంచలనం.. ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ భారీ విజయం

T20 world cup Aus vs NZ: గత ప్రపంచకప్ టీ20 విజేత.. అందరు ఆల్ రౌండర్లతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా.. పైగా సొంతగడ్డపై ఆడుతోంది. ఈసారి ఫైనల్ చేరే జట్టు ఏదని ఏ విశ్లేషకుడిని అడిగినా ‘ఆస్ట్రేలియా’ కంపల్సరీ ఉంటుందని అన్నారు. కానీ ఇది టీ20.. ఆరోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. అందుకే ఈ ఆటలో ఫేవరెట్లు ఉండరు.. ఈరోజు అదే జరిగింది. న్యూజిలాండ్ ను ఇటీవల కాలాల్లో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2022 / 04:20 PM IST
    Follow us on

    T20 world cup Aus vs NZ: గత ప్రపంచకప్ టీ20 విజేత.. అందరు ఆల్ రౌండర్లతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా.. పైగా సొంతగడ్డపై ఆడుతోంది. ఈసారి ఫైనల్ చేరే జట్టు ఏదని ఏ విశ్లేషకుడిని అడిగినా ‘ఆస్ట్రేలియా’ కంపల్సరీ ఉంటుందని అన్నారు. కానీ ఇది టీ20.. ఆరోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. అందుకే ఈ ఆటలో ఫేవరెట్లు ఉండరు.. ఈరోజు అదే జరిగింది. న్యూజిలాండ్ ను ఇటీవల కాలాల్లో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. అదే టీం చేతిలో ఈరోజు భారీ తేడాతో ఓడిపోయింది. ఓ రకంగా చిత్తుగా ఓడిందని చెప్పొచ్చు. ఒకటి కాదు రెండు టీ20ల్లో 89 పరుగుల తేడాతో అంటే అది భారీ పరాజయంగానే చెప్పొచ్చు.

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య ఈరోజు టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే అతిపెద్ద సంచలనం నమోదైంది. తొలుత టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ న్యూజిలాండ్ కు అదే వరమైంది. న్యూజిలాండ్ ఓపెనర్లు అలెన్(42), కాన్వే(92) పరుగులతో రెచ్చిపోయారు. ఇద్దరూ పోటాపోటీగా దంచి కొట్టడంతో ఆస్ట్రేలియా బౌలర్లు బేజారెత్తారు. కాన్వే చివరి వరకూ క్రీజులో ఉండి సెంచరీ కొట్టేలా కనిపించారు. ఇక చివర్లో వచ్చిన జీమ్మి నీషమ్ 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి దుమ్ముదులిపారు. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    ఇక ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టపటపా వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్(5), కెప్టెన్ ఫించ్(13) తక్కువ పరుగులకే ఔట్అయ్యారు. మార్ష్, టిమ్ డేవిడ్ కూడా త్వరగానే పెవిలియన్ దారి పట్టారు. ఉన్నంతలో మ్యాక్స్ వెల్ 28 , కమిన్స్ 21 పరుగులతో రాణించారు. కానీ కొండంత లక్ష్యం వీరితో కాలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడం.. న్యూజిలాండ్ బౌలర్ల సమిష్టి దాడితో 17.1 ఓవర్లలోనే 111 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. సాట్నర్ 3 వికెట్లు, టిమ్ సోథి 3 వికెట్లతో ఆస్ట్రేలియా వికెట్ల పతనాన్ని శాసించారు.

    డిఫెండింగ్ చాంపియన్.. ఈసారి ఫైనలిస్టు అని అందరూ కీర్తించిన ఆస్ట్రేలియా ఇలా చిత్తుగా ఓడిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోనే మట్టి కరవడం సంచలనమైంది. టీ20 అంటేనే ఇలాంటి సంచలనాలు ఉంటాయి. ఈరోజు అదే నమోదైంది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. మిగతా మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందన్న దానిపైనే దాని విజయావకాశాలు ఉంటాయి. ఇంకా చాలా మ్యాచులు ఉండడంతో అప్పుడే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. కానీ తొలి మ్యాచ్ ఓటమి ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ గానే చెప్పొచ్చు. మరి ఈ కంగారుల టీం ఎలా పుంజుకుంటుందన్నది వేచిచూడాలి.