ODI World Cup 2023 : కొన్ని టీమ్ లు అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తూ ఉంటాయి కానీ కప్పులను మాత్రం చాలా తక్కువగా గెలుచుకుంటాయి.అందుకు కారణం వారు నాకౌట్ మ్యాచుల్లో ఎక్కువగా విజయాలు సాధించకపోవడం…ఇక అలా జరగడానికి కారణం ఏంటంటే ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాళ్ల ప్లేయర్లు ప్రెజర్ ని కంట్రోల్ చేసుకోలేక చేతులెత్తేయడం ఇలాంటి వాటి వల్లనే అన్ని టీమ్ లు నాకౌట్ మ్యాచ్ లు ఓడిపోతు ఉంటాయి… ఇక ఇలాంటి క్రమంలో 2007వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి వస్తున్న న్యూజిలాండ్ టీమ్ ఇక ఇప్పుడు కూడా అదే కన్సిస్టెన్సీని మెంటైన్ చేస్తూ 2023 వరల్డ్ కప్ లో నెంబర్ ఫోర్త్ పొజిషన్ లో సెమీఫైనల్ కి చేరుకుంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ గత ఐదు సీజన్లలో సెమీ ఫైనల్ కి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు ఒక్క కప్పు కూడా కొట్టలేక పోవడం విశేషం…ఇక 2007 లో సెమీఫైనల్ లోకి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది.ఇక 2011 లో కూడా శ్రీలంక చేతిలోనే ఓడిపోయింది.ఇలా రెండు సార్లు సేమిస్ లోకి వచ్చి శ్రీలంక చేతిలో ఓడిపోయి వెనదిరిగింది.
ఇక 2015 వ సంవత్సరంలో సెమీస్ లో గెలిచి, ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియాతో తలపడింది. ఆస్ట్రేలియా కి మంచి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి న్యూజిలాండ్ టీమ్ చేతులెత్తేసింది దాంతో ఆస్ట్రేలియా 5 వ సారి వరల్డ్ కప్ గెలిచిన టీం గా చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 2019లో సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ ఇండియా ని ఓడించి ఫైనల్ కి చేరుకుంది. ఇక అప్పుడు ఇంగ్లాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో రెండు టీంల స్కోర్లు టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం తో ఆ మ్యాచ్ లో ఎక్కువ బౌండరీ లు కొట్టినందుకు గాను ఇంగ్లాండ్ టీమ్ గెలిచినట్టు గా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే న్యూజిలాండ్ టీం కూడా విజయాన్ని సాధించింది కానీ బౌండరీలు తక్కువ ఉండడం వల్ల ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ని గెల్చుకోవడం జరిగింది.
ఇక ఈసారి కూడా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఇండియాతో తలపడనుంది.ఇక 2019 లో జరిగిన సీన్ ను మళ్లీ రిపీట్ చేయాలని న్యూజిలాండ్ టీం చూస్తుంటే, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో జరిగిన ఓటమి కి రివెంజ్ తీర్చుకోవాలని ఇండియన్ టీం చూస్తుంది. ఇక ఏది ఏమైనా నవంబర్ 15వ తేదీన మాత్రం ఈ రెండు టీములు వాళ్ల బలబలాలను తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకైతే ఇండియన్ టీం ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది కానీ చివరి వరకు ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో మాత్రం ప్రతి మ్యాచ్ మన ఊహకు అందని విధంగా జరుగుతూనే వస్తుంది. కాబట్టి ఈ నాకౌట్ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందనేది చూడాలి….