New Zealand vs South Africa : సెంచరీలతో రఫ్ఫాడించిన న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్స్…సౌతాఫ్రికా కి ఏడుపొక్కటే తక్కువ…

న్యూజిలాండ్ టీమ్ టెస్టుల్లో చాలా స్ట్రాంగ్ టీమ్ అనేది అందరికీ తెలిసిన విషయమే, వాళ్ల బ్యాటింగ్ పర్ఫామెన్స్ తో ఆ విషయాన్ని మరొక సారి ప్రూవ్ చేశారు.

Written By: NARESH, Updated On : February 4, 2024 10:59 pm
Follow us on

New Zealand vs South Africa : న్యూజిలాండ్ సౌతాఫ్రికా టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. ఇక అందులో భాగంగానే మొదట బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ ఓపెనర్ ప్లేయర్లు అయిన డెవిన్ కాన్వే, లాతమ్ లను తొందరగా ఔట్ చేసి సౌతాఫ్రికా ఈ మ్యాచ్ ని చాలా గ్రాండ్ గా మొదలుపెట్టింది. అయితే వాళ్ల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఇద్దరు కూడా సౌతాఫ్రికా బౌలర్ల ను దీటుగా ఎదుర్కొంటూ మరొక వికెట్ పడకుండా చూసుకుంటూనే పరుగులు కూడా రాబట్టారు.

ఇక దాని ఫలితంగా ఇద్దరు సెంచరీలు చేసి న్యూజిలాండ్ టీమ్ లో ఉన్న ప్లేయర్ల యొక్క ప్రతిభ ఏంటో మరొకసారి ప్రపంచానికి తెలియజేశారు. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఏ టీమ్ లో ఉన్న ప్లేయర్లు అయిన కూడా మానసికంగా కొంతవరకు దెబ్బ తింటారు. దాంతో వాళ్ళు ఎలా ఆడాలి అనేది కూడా అర్థం కానీ పరిస్థితిలో ఉంటారు. కానీ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ లు మాత్రం ఎక్కడ భయపడకుండా చాలా కూల్ గా ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక మొదటిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది.

ఇక వీళ్లిద్దరూ సెంచరీలతో కదం తొక్కగా, సౌతాఫ్రికా బౌలర్లు ఆరంభంలో మెరుపులు మెరూపించినప్పటికీ వీళ్ళ ధాటికి మాత్రం చేతులెత్తేశారు. ఇక రచిన్ రవీంద్ర 118 పరుగులు చేయగా, విలియమ్సన్ మాత్రం 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ టీమ్ టెస్టుల్లో చాలా స్ట్రాంగ్ టీమ్ అనేది అందరికీ తెలిసిన విషయమే, వాళ్ల బ్యాటింగ్ పర్ఫామెన్స్ తో ఆ విషయాన్ని మరొక సారి ప్రూవ్ చేశారు.

ఇక రెండోవ రోజు సౌతాఫ్రికా న్యూజిలాండ్ ప్లేయర్లను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఇలాంటి సమయం లో రెండోరోజు సౌతాఫ్రికా ఎలాంటి గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగుతుంది అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. ఇక పీటర్సన్, మోర్కి మొదట్లో బౌలింగ్ బాగా వేసినప్పటికీ రచిన్ రవీంద్ర, విలియం సన్ లను ఎదుర్కోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి…