New Zealand Vs India: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను అజేయ శక్తిగా మలచిన తీరు రోహిత్ శర్మకు దక్కుతుంది. బంగ్లాదేశ్ దగ్గర నుంచి మొదలైన టీమ్ ఇండియా ప్రస్థానం న్యూజిలాండ్ వరకు విజయవంతంగా సాగింది. లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టును ఓడించిన భారత్.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. అన్ని రంగాలలో న్యూజిలాండ్ జట్టు పై చేయి సాధించింది. ఫలితంగా టీమిండియా కు విజయం సాధ్యమైంది. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా 2000 సంవత్సరంలో ఎదురైన నాకౌట్ ట్రోఫీ, 2021 లో తలెత్తిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఓటమికి న్యూజిలాండ్ పై బదులు తీర్చుకుంది.
Also Read: ఫైనల్లో ఇండియా విక్టరీ.. స్టేడియంలోనే దాండియా ఆడిన రోహిత్-విరాట్
క్లారిటీ ఇచ్చేశాడు
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వినిపించాయి. రోహిత్ శర్మ జట్టు మేనేజ్మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్ కు క్లారిటీ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని తాను ఆనందిస్తున్నారని.. ఈ గెలుపును ఆస్వాదిస్తున్నానని.. ఇంతలోనే రిటైర్మెంట్ గురించి మాట్లాడటం ఎందుకని రోహిత్ చురకలు అంటించాడు. తాను క్రికెట్ ఇంకా ఆడతానని.. అంతలోనే రిటైర్మెంట్ అంటూ గాలివార్తలను ప్రచారం చేయకూడదని రోహిత్ సూచించాడు.. టీమిండియాకు చేయాల్సింది చాలా ఉందని.. అది చేసిన తర్వాతే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని రోహిత్ పేర్కొన్నాడు. అంటే రోహిత్ ఇంకా సుదీర్ఘకాలం క్రికెట్ ఆడతాడని.. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలు అందించి క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది. మొత్తంగా రోహిత్ క్లారిటీతో రిటర్మెంట్ వార్తలకు పుల్ స్టాప్ పడినట్టే.
ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ అద్భుతంగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఓపెనర్ గిల్ తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ.. రోహిత్ మాత్రం బలంగా ఆడాడు. స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. దృఢమైన పరుగులు రాబట్టాడు. అందువల్లే టీమిండియా నిలబడగలిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఒత్తిడి తీసుకు వస్తున్నప్పటికీ.. ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు రోహిత్ శర్మ. అయితే రచిన్ రవీంద్ర వేసిన బంతిని రోహిత్ సరిగా అంచనా వేయలేకపోవడం.. ముందుకు వచ్చి ఆడాలని ప్రయత్నించడంతో.. బంతి ఒక్కసారిగా మిస్ అయింది. అది కాస్త కీపర్ చేతుల్లో పడింది. దీంతో కీపర్ బంతితో వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ పెవిలియన్ చేరుకున్నాడు.
Also Read: టీమ్ ఇండియా గెలిచిన వేళ.. ఆరు పదుల వయసులో స్టెప్పులు వేసిన సునీల్ గవాస్కర్..