New Zealand Vs Afghanistan: చిత్తుగా ఓటమే కాదు.. న్యూజిలాండ్ ఖాతాలో అనేక చెత్త రికార్డులు

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ పారూఖీ న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. అతడు ఈ ఘనత అందుకోవడం టీ20 వరల్డ్ కప్ లో ఇది రెండవసారి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 3:13 pm

New Zealand Vs Afghanistan

Follow us on

New Zealand Vs Afghanistan: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గయానా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ దారుణమైన ఓటమిని ఎదుర్కొంది.. ఏకంగా 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సరికొత్త రికార్డులను సృష్టిస్తే.. న్యూజిలాండ్ అత్యంత చెత్త ఘనతలను తన పేరు మీద లిఖించుకుంది. స్థిరమైన ఆట తీరుకు పేరుపొందిన న్యూజిలాండ్ జట్టు ఇలా కుప్పకూలడాన్ని కివీస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ ఈ మ్యాచ్ ద్వారా ఎలాంటి రికార్డులు నమోదయ్యాయంటే..

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ పారూఖీ న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. అతడు ఈ ఘనత అందుకోవడం టీ20 వరల్డ్ కప్ లో ఇది రెండవసారి.

ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఆఫ్గానిస్థాన్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ నిర్వహించే మూడు ఫార్మాట్ లలో ఏ టోర్నీలోనైనా ఆఫ్ఘనిస్తాన్ కు ఇది మూడవ అతిపెద్ద విజయం. 2021లో షార్జా వేదికగా స్కాట్లాండ్ తో తలపడిన ఆఫ్ఘనిస్తాన్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2024 ఉగాండా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 125 రన్స్ తేడాతో విజయం అందుకుంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా 2024 లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 84 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది.. 2021 అబుదాబి వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో 62 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇక ఈ మ్యాచ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఫారుఖీ 4/17, రషీద్ ఖాన్ 4/17 తో సరికొత్త రికార్డు సృష్టించారు. వీరి కంటే ముందు టీ20 వరల్డ్ కప్ ఓకే ఇన్నింగ్స్ లో ఒకే జట్టు బౌలర్లు చేరి నాలుగు వికెట్లు తీసిన ఘనత పాకిస్తాన్ బౌలర్లు ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిది పేరు మీద ఉండేది.. 2007లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు గుల్ 4/25, అఫ్రిది 4/19 వికెట్లు తీసి అదరగొట్టారు. ఆ తర్వాత స్కాట్లాండ్ జట్టుతో 2021లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ బౌలర్లు ముజీబ్ రెహ్మాన్ 5/20, రషీద్ ఖాన్ 4/9 వికెట్లు తీసి సత్తా చాటారు.

ఆఫ్ఘనిస్తాన్ పై 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. టి20 ప్రపంచ కప్ లో పరుగుల పరంగా న్యూజిలాండ్ కు ఇదే అతిపెద్ద ఓటమి.. ఇక ఐదు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడ్డాయి.. అయితే న్యూజిలాండ్ ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ పై 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ కెప్టెన్ హోదాలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇతడి కంటే ముందు న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెటోరి 2007లో టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్ల తీశాడు. 2021 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఒమన్, పపుమా న్యూ గినియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సుద్ పపుమా న్యూ గినియా పై 20 పరుగులు ఇచ్చి నాలుగు టికెట్లు తీశాడు..

ఇక టి20 వరల్డ్ కప్ లో అత్యల్ప స్కోర్లను నమోదు చేసిన జట్లను పరిశీలిస్తే.. 2014 టి20 వరల్డ్ కప్ లో చటోగ్రామ్ వేదికగా న్యూజిలాండ్ శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 60 పరుగులకే ఆల్ అవుట్ అయి చెత్త రికార్డు నమోదు చేసుకుంది.. 2016 టి20 వరల్డ్ కప్ లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 70 పరుగులకే చాప చుట్టేసింది. 2021 వరల్డ్ కప్ లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 72 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. 2024 అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడగా.. న్యూజిలాండ్ 75 పరుగులకే ఆల్ అవుట్ అయింది.