Homeక్రీడలుక్రికెట్‌ICC Men's T20 World Cup: వీరవిధేయ ఇండియన్ క్రికెట్ అభిమానులారా.. ఒక్కసారి ఈ వీడియో...

ICC Men’s T20 World Cup: వీరవిధేయ ఇండియన్ క్రికెట్ అభిమానులారా.. ఒక్కసారి ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోండి!

ICC Men’s T20 World Cup: క్రికెట్ ఒక కులం అయితే మన దేశంలో అదే పెద్దదిగా ఉండేది. క్రికెట్ అనేది ఒక మతం అయితే మన దేశంలో అతిపెద్దది గా గుర్తింపు ఉండేది. క్రికెట్ అనేది మన నరు నరాలలో జీర్ణించుకో పోయింది. జాతీయ క్రీడను సైతం పక్కన నెట్టి.. మన ఇంటి ఆటగా.. మనం ఇష్టంగా చూసుకునే క్రీడగా.. మనకంటూ ఒక వ్యాపకం లాగా మారిపోయింది. చాలామందికి జీవితాశయంలాగా రూపాంతరం చెందింది…

ప్రపంచంలో ఎన్నో దేశాలు క్రికెట్ ఆడుతుంటాయి. కానీ మనదేశంలో ఆడే క్రికెట్ కు.. క్రికెటర్లకు ఒక రేంజ్ ఉంటుంది. ముంబై నుంచి మొదలు పెడితే గౌహతి వరకు ఎన్నో మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాలలో ఎప్పుడు ఎక్కడ మ్యాచ్ జరిగినా సరే భారతీయ అభిమానులు తండోపతండాలుగా వెళుతూనే ఉంటారు. ఆడేది మనదేశమా.. ఇంకో దేశమా అనేది చూడరు. మైదానంలోకి వెళ్తారు.. ఆటగాళ్ల ప్రదర్శన చూస్తారు.. ఆ తర్వాత తమ అభిమానాన్ని ప్రదర్శించి వస్తారు..

అభిమానాన్ని ప్రదర్శించే విషయంలో కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. ఇలా రాయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. ఎందుకంటే అభిమానం పేరుతో కొంతమంది వ్యవహరించే తీరు అత్యంత దారుణంగా ఉంటుంది . చెత్త కాగితాలను విసరిస్తుంటారు. ఫ్ల కార్డులను చింపి మైదానంలో పడేస్తుంటారు. ఆ తర్వాత తమ దారిలో తాము వెళ్ళిపోతుంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పారిశుధ్య సిబ్బందికి ఈ చెత్తను మొత్తం ఎత్తివేయడం.. దానిని ఊడ్చి డంపింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ పారిశుద్ధ్య సిబ్బంది కష్టాన్ని ఎప్పుడు కూడా అభిమానులు లెక్కలోకి తీసుకోరు.

ప్రస్తుతం మన దేశంలో టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ముంబైలో ఇంగ్లాండ్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నేపాల్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ.. నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారంతా కూడా మైదానాన్ని చెత్త చెత్త చేసేశారు. ఈ నేపథ్యంలో నేపాల్ అభిమాని ఆ మైదానంలో ఉన్న చెత్తను మొత్తం సేకరిస్తూ కనిపించాడు. అంతేకాదు ప్రేక్షకులను మర్యాదగా పలకరిస్తూ.. చెత్తను మొత్తం ఒకచోట పడేసాడు. అతడేమి నీతి వ్యాఖ్యలు చెప్పలేదు. హితబోధ కూడా చేయలేదు. కేవలం ఒక అభిమానిగా ఏం చేయాలో అది చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో టీమిండియా అభిమానులు ఇలాంటి వ్యక్తులను చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular