https://oktelugu.com/

Hardik Pandya : హార్దిక్ వద్ద కొడుకును వదిలిపెట్టిన నటాషా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులు

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా మోడల్ నటాషా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరి కాపురంలో విభేదాలు చోటుచేసుకున్నాయి.. చివరికి అవి విడాకులకు దారి తీశాయి. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా ప్రకటించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 11, 2024 / 09:55 PM IST

    Hardik Pandya

    Follow us on

    Hardik Pandya : విడాకులు తీసుకున్న తర్వాత కుమారుడు అగస్త్య తో నటాషా సెర్బియా వెళ్ళిపోయింది. అతడి నాలుగో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా గ్రీస్ దేశంలో విహారయాత్రకు వెళ్లాడు. అయితే అతడు మరో యువతితో డేటింగ్ లో ఉన్నాడని.. ఆమెను తీసుకొని గ్రీస్ వెళ్లాడని ప్రచారం జరిగింది. తను గ్రీస్ దేశానికి వెళ్లిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో హార్థిక్ పాండ్యా పంచుకున్నాడు.. అదే లోకేషన్ లో ఆ యువతి ఫోటోలు దిగి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. కాగా, హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోలను ఆ యువతి లైక్ చేయడం విశేషం. అంతేకాదు ఆ ఫోటోలకు లవ్ సింబల్ ను పోలి ఉన్న ఎమోజిలను ఆమె రిప్లై రూపంలో ఇవ్వడం గమనార్హం. దీంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనిని అటు హార్దిక్ పాండ్యా, ఇటు ఆ యువతి ఖండించలేదు. అయితే ఆ యువతి భారతీయ మూలాలు ఉన్న ఇంగ్లాండ్ దేశస్థురాలని.. ఆమె సంగీత కళాకారిణి అని జాతీయ మీడియాలో ప్రసారమైన వార్తలు ద్వారా తెలుస్తోంది.

    ఇండియాకు తీసుకొచ్చింది

    ఇక నటాషా తన కుమారుడిని ఇండియాకు తీసుకొచ్చింది. తన మాజీ భర్త హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.. ఆ తర్వాత తన మోడలింగ్ పనుల్లో బిజీ బిజీగా మారిపోయింది. హాట్ హాట్ దుస్తులు ధరించి ఫోటో షూట్ చేసింది.. తన అధికారిక సామాజిక మాధ్యమా ఖాతాలలో ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. హార్థిక్ పాండ్యాను ప్రేమించక ముందు నటాషా మోడలింగ్ కోసం సెర్బియా నుంచి ఇండియాకు వచ్చింది. ఒక పార్టీలో హార్దిక్ పాండ్యా పరిచయం కావడంతో.. అది కాస్త స్నేహంగా.. ప్రేమగా మారింది. ఆ తర్వాత వాళ్ళు కొద్ది రోజుల పాటు డేటింగ్ చేశారు. నటాషా గర్భవతి అయిన తర్వాత.. హార్దిక్ పాండ్యా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారిద్దరు క్రిస్టియన్ పద్ధతి లోనూ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల వారిద్దరి వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరు పరస్పరం విడిపోయారు. విడిపోయినప్పటికీ అగస్త్యకు హార్దిక్ పాండ్యా కో – పేరెంట్ గా వ్యవహరిస్తున్నాడు.

    అందువల్లే విడాకులు తీసుకున్నారా..

    హార్దిక్ పాండ్యా విలాసవంతమైన జీవితం.. పలు సంబంధాలు కలిగి ఉండడం వల్లే నటాషాతో విభేదాలు వచ్చాయని.. అవి కాస్త విడాకులకు దారితీసాయని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నటాషా – హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడం వల్ల వారిద్దరి కుమారుడు అగస్త్య తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఏకకాలంలో తల్లి ప్రేమ, తండ్రి వాత్సల్యం దక్కించుకోలేక నరకం చూస్తున్నాడు. సెలబ్రిటీలు ఇలా అకస్మాత్తుగా విడాకులు తీసుకోవడం వల్ల.. అది అంతిమంగా వారి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తోంది.