Aamir Khan : విచిత్రమైన నిర్ణయం తీసుకున్న అమీర్ ఖాన్.. రెండు ఫ్లాప్స్ ఈయనని పిచ్చోడిని చేసాయిగా!

దంగల్' చిత్రం వరకు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూలింగ్ ఎలా ఉండేది అంటే, ఆయన సినిమాల రికార్డ్స్ ని కేవలం ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. ఆయన తోటి సూపర్ స్టార్స్ దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదు. కానీ బాహుబలి సిరీస్ తర్వాత లెక్కలు మారిపోయాయి. బాలీవుడ్ లో మన టాలీవుడ్ డామినేషన్ మొదలైంది. ఖాన్స్ మన దాటికి నిలబడలేకపోయారు.

Written By: Vicky, Updated On : September 11, 2024 9:42 pm

Aamir Khan

Follow us on

Aamir Khanz : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో కేవలం స్టార్ డమ్ తో థియేటర్స్ కి టాక్ తో సంబంధం లేకుండా రప్పించే సూపర్ స్టార్స్ లో ఒకరు అమీర్ ఖాన్. అందరూ ఈయనని బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. పాత్ర కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి అయినా సిద్దమైపోతాడు అమీర్ ఖాన్. అందుకే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఈయన సినిమా వచ్చిందంటే క్యూలు కట్టేస్తారు. ‘దంగల్’ చిత్రం వరకు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూలింగ్ ఎలా ఉండేది అంటే, ఆయన సినిమాల రికార్డ్స్ ని కేవలం ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. ఆయన తోటి సూపర్ స్టార్స్ దరిదాపుల్లో కూడా వచ్చేవారు కాదు. కానీ బాహుబలి సిరీస్ తర్వాత లెక్కలు మారిపోయాయి. బాలీవుడ్ లో మన టాలీవుడ్ డామినేషన్ మొదలైంది. ఖాన్స్ మన దాటికి నిలబడలేకపోయారు.

అమీర్ ఖాన్ దంగల్ చిత్రం తర్వాత ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మరియు ‘లాల్ సింగ్ చద్దా’ వంటి చిత్రాలు మాత్రమే చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇవి అమీర్ ఖాన్ కి కోలుకోలేని దెబ్బ. అసలే సినిమాలు ఆలస్యంగా చేస్తాడని అమీర్ ఖాన్ ఒక చెడ్డ పేరుంది. అలాంటిది రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యేలోపు తనని తాను మార్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. గతం లో ఆయన దర్శకుడిగా, నిర్మాతగా మారి ‘తారే జమీన్ పర్’ అనే అద్భుతమైన క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అమీర్ ఖాన్ కూడా నటించాడు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు అమీర్ ఖాన్. ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తో మరోసారి ఆయన బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే అమీర్ ఖాన్ రీసెంట్ గా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట తన నిర్మాణ సంస్థల్లో వచ్చే సినిమాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని, సినిమా విడుదలకు ముందు అమ్మకూడదని ఫిక్స్ అయ్యాడు.

సినిమా విడుదలై థియేటర్స్ లో అత్యధిక రోజులు ఆడిన తర్వాత మాత్రమే డిజిటల్ రైట్స్ గురించి ఆలోచిస్తాడట. ఓటీటీ కారణంగా థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది, ఇలాంటి సమయంలో ఇంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే మార్పులు వస్తాయని అమీర్ ఖాన్ బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ అమ్మకానికి గురి కాకుంటే థియేట్రికల్ రిలీజ్ ని సైతం ఆపేస్తున్న నిర్మాతలు ఉన్న ఈరోజుల్లో, అమీర్ ఖాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా డేర్ అని అంటున్నారు. మరికొంతమంది అయితే రెండు ఫ్లాప్స్ పడేలోపు అమీర్ ఖాన్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.