https://oktelugu.com/

Natasa stancovic: మమ్మల్ని క్షమించు.. నటాషాకు హార్దిక్ అభిమానుల విన్నపాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

నటాషా తో విడాకుల తర్వాత హార్దిక్ మరో యువతితో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. గాయకురాలు జాస్మిన్ వాలియా తో అతడు డేటింగ్ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ గ్రీస్ దేశంలో ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర హార్దిక్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. జాస్మిన్ కూడా అదే స్విమ్మింగ్ పూల్ వద్ద ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 18, 2024 / 02:06 PM IST

    Natasa stancovic

    Follow us on

    Natasa stancovic: సెలబ్రిటీల ప్రేమలు ఇన్ స్టంట్ కాఫీలాంటివి. ఎంత త్వరగా పుడతాయో.. అంత త్వరగా ముగుస్తాయి. వీరి పెళ్లిళ్లు కూడా అలాంటివే. పిల్లలు కలిగినా కూడా.. అహాలు, ఇతర సంబంధాల వల్ల తెగదెంపులు చేసుకుంటారు. ఈ జాబితా గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. ఇక ఇటీవల స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా – నటాషా జంట విడాకులు తీసుకుంది. వీరి విడాకులపై గత కొద్దిరోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అటు హార్దిక్, ఇటు నటాషా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ టి20 వరల్డ్ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కొద్ది రోజులకు హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని ప్రకటించాడు. నటాషా కూడా అదే విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం నటాషాకుమారుడు నాలుగేళ్ల అగస్త్య ఆమెతోనే ఉన్నాడు. ప్రస్తుతం వారు సెర్బియాలో ఉంటున్నారు.

    నటాషా తో విడాకుల తర్వాత హార్దిక్ మరో యువతితో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. గాయకురాలు జాస్మిన్ వాలియా తో అతడు డేటింగ్ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ గ్రీస్ దేశంలో ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర హార్దిక్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. జాస్మిన్ కూడా అదే స్విమ్మింగ్ పూల్ వద్ద ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ లోకేషన్ మొత్తం ఒకేలా ఉండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియాలో జాస్మిన్ ఫాలో అవుతోంది. అతడు పెట్టే ఫోటోలకు లైక్ కొడుతోంది. గ్రీస్ లో స్విమ్మింగ్ పూల్ వద్ద హార్దిక్ దిగిన ఫోటోలను ఆమె లైక్ చేసింది. దీంతో వీరిద్దరూ గాడమైన ప్రేమలో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో “మోసం” తరహా రీల్స్ కు నటాషా లైక్స్ కొడుతోంది. అంటే నటాషాను హార్దిక్ మోసం చేశాడని చెప్పకనే చెబుతోంది. నటాషా చేస్తున్న ఈ పనిని హార్దిక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగానే ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు.

    కానీ ఎప్పుడైతే జాస్మిన్ తో హార్దిక్ లవ్ లో ఉన్నాడని తెలిసిందో.. అప్పటినుంచి హార్దిక్ అభిమానులు రియలైజ్ అయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా నటాషాకు క్షమాపణలు చెబుతున్నారు.” మొదట్లో మిమ్మల్ని ఏదో అనుకున్నాం. ఇప్పుడు నిజం తెలిసింది. మమ్మల్ని మీరు క్షమించండి” అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెను కోరుతున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా తో విడిపోయిన తర్వాత తన కుమారుడు అగస్త్యతో కలిసి నటాషా పలు ప్రాంతాలను సందర్శిస్తోంది. ఇటీవలే అతడి నాలుగవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపింది. విభిన్నమైన నేపథ్యాలను సృష్టించి అతడిలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ దృశ్యాలను ఎప్పటికప్పుడు నటాషా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నది. ఈ సందర్భంగా సింగిల్ మదర్ కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.