https://oktelugu.com/

Inter Board : ఇంటర్ బోర్డు పరీక్ష రద్దు.. సిలబస్ సగానికి తగ్గింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం?

వచ్చే ఏడాది నుంచి ఈ మార్పులు రానున్నాయి. దీనిపై ఉన్నత విద్యాశాఖ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత నూతన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే మన రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 18, 2024 / 02:17 PM IST

    inermediate Board

    Follow us on

    Inter Board : ప్రభుత్వాలు మారిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యావ్యవస్థలో కూడా మార్పులు జరుగుతాయి. కొత్తగా వాళ్ల పాలన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం మార్పులు, చేర్పులు చేస్తుంటారు. ఎప్పటికప్పుడే విద్యావిధానాలపై మార్పులు చేస్తుంటారు. ఈక్రమంలో ఎన్నోసార్లు సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మళ్లీ ఈసారి కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంటర్మీడియట్ సిలబస్ విధానంలో మార్పులు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరీక్షల్లో మార్పులు చేయడంతో పాటు సిలబస్‌ కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ మార్పులు రానున్నాయి. దీనిపై ఉన్నత విద్యాశాఖ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత నూతన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే మన రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది. దీనిని తగ్గించాలని బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తుంది. ఈక్రమంలో గణితం సబ్జెక్ట్‌లో కొంత వరకు తగ్గించనున్నట్లు సమాచారం.

    ప్రస్తుతానికి గణిత రెండు పేపర్లు ఉన్నాయి. అయితే సిలబస్ తగ్గించిన తర్వాత రెండు పేపర్లను కొనసాగిస్తారా? ఒక పేపర్ ఉంచుతారా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. బైపీసీ గ్రూప్‌లో అయితే ఎన్సీఈఆర్టీలో కేవలం జీవశాస్త్రం మాత్రమే ఉంది. ఇంటర్‌ బైపీసీలో బాటనీ, జీవశాస్త్రం సబ్జెక్ట్‌లు వేర్వేరుగా ఉన్నాయి. వీటిపైన కూడా బోర్డు ఆలోచిస్తుంది. అయితే ఇంటర్మీడియట్‌లో బోర్డు పరీక్షలు రెండేళ్లు జరుగుతాయి. కానీ సీబీఎస్‌ఈలో 11వ తరగతికి సంబంధించి బోర్డు పరీక్ష అసలు లేదు. కేవలం అంతర్గత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని రాష్ట్ర భోర్డులోకి తీసుకురావడం ఎలా ఉంటుందని బోర్డు అధికారులు ఆలోచిస్తున్నారు. కొత్తగా మళ్లీ ఇలా తీసుకురావడం వల్ల విద్యార్థులపై ఒత్తిడిపై పడుతుందా? లేకపోతే తగ్గుతుందా? అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు.

    ఇంటర్‌లో జనరల్ సబ్జెక్టులతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, వొకేషనల్ సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఆలోచించి ఈ విధానాలను పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కేవలం వాళ్ల నిర్ణయంతోనే సిలబస్, పరీక్ష విధానాల్లో మార్పులు చేయాలని అనుకోవడం లేదు. కాలేజీ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను కూడా తీసుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నది. అందరి నుంచి వచ్చిన ప్రతిపాదనలను తీసుకుని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో దీనిపై చర్చ జరిపాక నిర్ణయం తీసుకోనున్నారు.