MS Dhoni Injury: ఐపీఎల్ 16వ సీజన్ ఛాంపియన్.. ఐదోసారి టైటి సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆస్పత్రిలో చోరబోతున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చెన్నై ఓడించింది. ఐదోసారి టైటిల్ తన ఖాతాలో వేసుకుని రికార్డు సమం చేసింది. ఇందులో ధోనీ కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్‌లో ధోనీ గోల్డెన్ డక్ అయినా.. నాయకుడిగా జట్టును సమష్టిగా ముందుకు నడిపించి ఛాంపియన్‌గా నిలిపాడు.
మోకాలికి గాయం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తర్వాత ఎంఎస్. ధోని మోకాలి గాయం తీవ్రమైంది. వాస్తవానికి ధోని మోకాలి గాయంతో ఐపీఎల్–2023లో ప్రవేశించాడు, చాలా మ్యాచ్‌లలో అతను మోకాలి చిప్ప ధరించి కనిపించాడు. ఎడమ మోకాలికి కూడా బరువైన పట్టీలు ఉన్నాయి. టోర్నీ ముగిసే వరకు నొప్పి తీవ్రమైంది. దీంతో పలు పరీక్షల నిమిత్తం ఈ వారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరనున్నారు.
శరీరం సహకరిస్తేనే మరో ఐపీఎల్..
ఇదిలా ఉండగా, ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అవుతుందని చాలా మంది ఆందోళన చెందారు. అందుకే చెన్నై గెలవాలని చాలా మంది ఆకాంక్షించారు. అందరి ఆకాంక్ష ఫలించి చెన్నై చాంపియన్‌గా నిలిచింది. కానీ, రిటైర్మెంట్‌పై ధోనీ కీలక ప్రకటన చేశాడు. తన శరీరం సహకరిస్తేనే వచ్చే ఐపీఎల్ ఆడతానని తెలిపాడు. నిర్ణయం తీసుకోవడానికి మరో ఆరేడు నెలల సమయం ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకోవడం ఫ్యాన్స్‌ను ఒకింత టెన్షన్ పెడుతోంది. రెండు కాళ్లకు గాయాలు ఉన్నాయా.. అవి త్వరలో నయం అవుతాయా.. వైద్యులు ఏం చెబుతారు. వైద్య పరీక్షల తర్వాత ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
వైద్య పరీక్షల తర్వాత ఏం జరుగుతుంది..
ధోనీ వైద్య పరీక్షల తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలిసోతుంది. అయితే ప్రతీ ఇండియన్ క్రికెటర్ మాత్రం ధోనీ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. అతని కాలి గాయం త్వరగా నయం కావాలని కోరుకుంటున్నారు.