Kriti Sanon: ప్రభాస్ కోసం ప్రత్యేక పూజలు చేయిస్తున్న కృతి సనన్.. వీళ్లిద్దరి ప్రేమకు ప్రూఫ్ ఇదే!

మరి కొంతమంది అభిమానులు త్వరలో విడుదల అవ్వబోతున్న 'ఆదిపురుష్' చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ కృతి సనన్ పూజలు చెయ్యిస్తుందే కానీ, మీరు అనుకున్నట్టు కాదని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది, ఇక రీసెంట్ గానే 'ఆదిపురుష్' చిత్రం లోని రెండవ పాట 'రామ్ సీత రామ్' విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. తెలుగులో కంటే కూడా ఈ పాటకి హిందీ లోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది.

Written By: Vicky, Updated On : May 31, 2023 2:38 pm

Kriti Sanon

Follow us on

Kriti Sanon: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రభాస్ – కృతి సనన్ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని. దీనిపై అటు ప్రభాస్ , ఇటు కృతి సనన్ పలు మార్లు మీడియా ముఖంగా స్పందించి అలాంటిదేమి లేదు అని క్లారిటీ ఇచ్చినా కూడా జనాలు నమ్మడం లేదు.

ఎందుకంటే వీల్లద్దరి క్యూట్ పెయిర్ మరియు వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది మరి. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ‘ఆదిపురుష్’ అనే చిత్రం లో నటించారు. జూన్ 16 వ తేదీన ఈ చిత్రం విడులా కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ మరియు కృతి సనన్ నాన్ స్టాప్ ప్రొమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా కృతి సనన్ గురించి ఒక వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.

కృతి సనన్ రీసెంట్ గానే ఒక గుడిలో పూజలు చేస్తూ కనిపించిన వీడియో ని సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు పోస్టు చేసారు. ఈ వీడియోలు ఆమె ప్రభాస్ కోసమే చేయించిందని,గతం లో ప్రభాస్ కి కాళ్లకు సంబంధించి ఒక మేజర్ ఆపరేషన్ జరిగిందని, ఈ ఆపరేషన్ కరెక్ట్ గా జరిగితే గుడి కి వచ్చి పూజలు చేయిస్తానని కృతి సనన్ మొక్కుకుందట. అందులో భాగంగానే ఆమె గుడిలో పూజలు చేయించింది అంటూ ఒక వార్తని ప్రచారం చేసారు.

మరి కొంతమంది అభిమానులు త్వరలో విడుదల అవ్వబోతున్న ‘ఆదిపురుష్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ కృతి సనన్ పూజలు చెయ్యిస్తుందే కానీ, మీరు అనుకున్నట్టు కాదని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది, ఇక రీసెంట్ గానే ‘ఆదిపురుష్’ చిత్రం లోని రెండవ పాట ‘రామ్ సీత రామ్’ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. తెలుగులో కంటే కూడా ఈ పాటకి హిందీ లోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది.