Dhruv Jurel: ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22న చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమవుతుంది. లీగ్ మ్యాచ్ లు ఏప్రిల్ 7 నాటికి ముగుస్తాయి. మొత్తం 21 లీగ్ మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్రోఫీ కోసం అన్ని జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. పాకిస్తాన్ మినహా మిగతా అన్ని జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతున్న నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఈ సందర్భంగా ధృవ్ జురెల్, మహేంద్ర సింగ్ ధోని మధ్య సాగిన ఒక సంభాషణకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో ధృవ్ జురెల్ మెరిశాడు. ముఖ్యంగా రాంచి వేదికగా జరిగిన నాలుగవ టెస్టులో భారత జట్టును ఓటమి నుంచి బయటపడేశాడు. 90 పరుగులు చేసి భారత జట్టు కీలక 90 పరుగులు చేసి భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కీలకమైన క్యాచ్ లు కూడా పట్టాడు. దీంతో సీనియర్ ఆటగాళ్లు ధృవ్ జురెల్ పై ప్రశంసల జల్లు కురిపించడం మొదలుపెట్టారు. సీనియర్ ఆటగాడు సునీల్ గవాస్కర్ అయితే ఏకంగా ధృవ్ జురెల్ ను ఆకాశానికి ఎత్తాడు. “అతడు బాగా ఆడుతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన 90 పరుగులు చేశాడు. స్టంప్ అవుట్ లు కూడా అద్భుతంగా చేస్తున్నాడు. అతడి ఫుట్ వర్క్ బాగుంది. చూస్తుంటే టీమిండియాలో ధోనిని మించిపోయేలా కనిపిస్తున్నాడని” సునీల్ గ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ మాటలకు ధృవ్ జురెల్ ఎలాంటి స్పందననూ వ్యక్తం చేయలేదు.
అయితే ఇటీవల మహేంద్ర సింగ్ ధోనిని ధృవ్ జురెల్ కలిశాడు. జెర్సీపై మహేంద్ర సింగ్ ధోనితో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. అతనితో కలిసి ఫోటోలు దిగాడు..కొద్దిసేపు మాట్లాడాడు. ఇద్దరూ సరదాగా సంభాషణలు చేసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. “సునీల్ సార్ మీ ప్రశంసలు నాకు ఆనందంగా ఉన్నాయి. కానీ వర్తమాన క్రికెట్ లో ధోని ఎప్పటికైనా ఒక్కడే. అతడి స్థానాన్ని, స్థాయిని అధిగమించడం నావల్ల కాదు” అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు ధృవ్ జురెల్ అభినందిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదినట్టు ఉన్నాడని ధృవ్ జురెల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Dhruv Jurel said “Thank you so much Gavaskar sir for comparing me with Dhoni sir but I no one can replicate what Dhoni sir has done, there is only one Ms Dhoni – always was & always will be” [India Today Conclave] pic.twitter.com/Tfc9Q6sOWv
— ICT Fan (@Delphy06) March 15, 2024