MS Dhoni Fitness: క్రికెట్ ప్రపంచానికి ధోని పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీమిడియాకు అద్భుతమైన విజయాలు అందించిన సారధిగా అతని చరిత్ర అమూల్యం. అనన్య సామాన్యం. అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికినప్పటికీ ఇప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ లో అతడు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వస్తే చాలు ప్రేక్షకులు పూనకాలు ఊగిపోతుంటారు. అతడు ఒక బౌండరీ సాధించినా, సిక్సర్ కొట్టినా ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్లిపోతుంటారు. ధోనికి ఈ స్థాయిలో అభిమాన గణం ఉంది కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ధోని ఎదుట మోకరిల్లుతున్నాయి. ఇప్పటికీ అతనితో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నాయి. ధోని కూడా ఏమాత్రం తగ్గకుండా వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ భారీగానే సంపాదిస్తున్నాడు.
Also Read: చివరి చిత్రంపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!
ధోనికి సంపాదన మీద ఎంత అయితే ఇష్టం ఉంటుందో.. సమాజం, ప్రజలు, ఇతర విషయాలపై కూడా అంతే ఇష్టం ఉంటుంది. మిగతా క్రికెటర్ల మాదిరిగా నాకెందుకు అని ధోని ఊరుకోడు. పైగా తనదైన స్పందనను మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారీరక సామర్థ్యం గురించి.. దేశ యువత అనుసరిస్తున్న విధానాల గురించి ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు..” శారీరక సామర్థ్యం కలిగి ఉండాలంటే కచ్చితంగా శ్రమించాలి. మితంగా ఆహారం తీసుకోవాలి. అడ్డగోలుగా తినకూడదు. అలా తింటే ఇబ్బందులు ఎదురవుతాయి. నేటి కాలంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా శరీరానికి హాని చేసే ఆహారాన్ని తీసుకుంటున్నారు. దానివల్ల రోగాల బారిన పడుతున్నారు. ఫలితంగా భారతీయుల సగటు ఆయు ప్రమాణం పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా యువత శారీరకంగా కష్టపడడంలో ఆసక్తిని చూపించడం లేదని” ధోని వ్యాఖ్యానించాడు.. కేవలం భారతదేశ యువత గురించి మాత్రమే కాకుండా.. తన కూతురి గురించి కూడా ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు..” నాకు ఒక కుమార్తె ఉంది. ఆమె కూడా పెద్దగా కష్టపడడం లేదు. శారీరకంగా శ్రమించడం లేదు. ఆమెకు క్రీడలు అంటే ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే శరీరాన్ని కష్టపెట్టుకోవడాన్ని ఇష్టపడదు. అది నాకు ఆందోళన కలిగిస్తోందని” ధోని వ్యాఖ్యానించాడు.
ధోని, సాక్షి దంపతులకు ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఇటీవల ఆమె కాస్త బొద్దుగా కనిపిస్తోంది. చిన్నతనం వల్ల అలా అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ధోని చెప్పిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి ధోని కుమార్తె కూడా శారీరకంగా కష్టపడదని తేలిపోయింది. అందువల్లే ఆమె అలా బొద్దుగా కనిపిస్తోందని ధోని మాటలు ద్వారా అర్థమైంది. వాస్తవానికి అంత చిన్న వయసులో అలా బొద్దుగా ఉంటే రకరకాల రుగ్మతలు వస్తుంటాయి. నేటి కాలంలో చిన్నతనంలోనే పిల్లలకు మధుమేహం, థైరాయిడ్ సమస్య, రక్తపోటు, ఇతర జీవన సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అటువంటివారు తమ ఆహార శైలి, జీవనశైలి మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. చక్కెర సంబంధిత పదార్థాలు తినకూడదు. విధంగా ఆహార తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో కాయగూరలు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు..