Today 23 July 2025 Horoscope: పంచాంగం ప్రకారం బుధవారం ద్వాదశ రాజులపై ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులు ఈరోజు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. పర్సనల్ సంబంధించిన విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ప్రయాణాలు చేయాల్సివస్తే వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొంటే తల్లిదండ్రుల సపోర్టు ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులు శుభవార్తలు వింటారు. వీరికి కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే ఎటువంటి రహస్యాలను వీరితో పంచుకోకుండా ఉండాలి. ఉద్యోగులు తమ విధుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు.. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విదేశాల కోసం వెళ్లే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు గురువుల సహకారం తీసుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇతరులకు అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. మానసిక భారం నుంచి విముక్తి పొందుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాప పడతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చవద్దు. వ్యాపారులు కొత్తవారిని భాగస్వాములుగా చేర్చుకోవద్దు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంపాదించాలి. నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. శుభ కార్యక్రమం లో పాల్గొంటారు. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనిని త్వరగా పూర్తి చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూల్ అవుతుంది.. మరోసారి ఎవరికీ అప్పు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. వీటిని సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వివిధ భాగస్వామితో కలిసి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగుల లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దీ నికోసం తీవ్రంగా కృషి చేస్తారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి పెద్దల ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు ఈ రాశి వారు ఇతరులకు సహాయం చేస్తారు. అనుకోకుండా ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది. వ్యాపారులు ఊహించని ధన లాభం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్త పనులను ప్రారంభించవచ్చు. అయితే జీవిత భాగస్వామి సలహాలు పాటించాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు ఈరోజు చేతికి అందుతుంది. వ్యాపారులు భాగస్వాములతో పర్సనల్ విషయాలను పంచుకోకుండా ఉండాలి. ముఖ్యమైన సమాచారాన్ని జీవిత భాగస్వామితో పంచుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే పరిష్కరించుకోవాలి. సోదరులతో ఆస్తి విషయంలో గొడవలు ఉంటాయి. అయితే పెద్ద సలహాతో ఇవి పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈరోజు వారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. పేదలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే ఎవరికైనా వస్తువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో పకడ్బందీగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు వస్తాయి. ప్రణాళిక బద్ధంగా అస్తులు చేస్తారు. దీంతో ఆదాయం మెరుగు పడుతుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారితో వాగ్వాదానికి దిగుతారు. అయితే అధికారుల చొరవతో పరిష్కరించుకుంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వారికి ఈ రోజు లక్ష్మి కటాక్షం కలగనుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన రోజు. గతంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా ధన లాభం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన పెద్దల సలహా తీసుకోవాలి.