Homeక్రీడలుMS Dhoni- Donald Trump: అట్లుంటది ధోనితో.. డొనాల్డ్‌ ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన జార్ఖండ్‌ డైనమేట్‌.....

MS Dhoni- Donald Trump: అట్లుంటది ధోనితో.. డొనాల్డ్‌ ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన జార్ఖండ్‌ డైనమేట్‌.. మహి వీడియో వైరల్‌!

MS Dhoni- Donald Trump: భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. తాజాగా అతడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడాడు. గత మేలో ముగిసిన ఐపీఎల్‌–16 తర్వాత మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

అమెరికా పర్యటన..
మహేంద్రుడు.. అమెరికా పర్యటనలో భాగంగా బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో మాజీ యూఎస్‌ ప్రెసిడెంట్‌ను కలిశాడు. ట్రంప్‌ ఆహ్వానం మేరకే ధోని ఇక్కడికి వెళ్లినట్టు సమాచారం. ధోని – ట్రంప్‌ కలిసి గోల్ఫ్‌ ఆడుతున్న ఫొటోలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

సినిమా ప్రమోషన్‌..
తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ‘ఎల్‌జీఎం’ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో కనిపించిన ధోని ఆ తర్వాత తాజాగా మీడియాలో కనిపించడం ఇదే తొలిసారి.

యూఎస్‌ ఓపెన్‌ వీక్షణ..
అమెరికా పర్యటనలో ఉన్న ధోని.. యూఎస్‌ ఓపెన్‌ పోటీలను కూడా వీక్షించాడు. గురువారం స్పెయిన్‌∙సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ – జర్మనీ ఆటగాడు అలగ్జాండర్‌ జ్వెరెవ్‌ల మ్యాచ్‌ను తిలకించిన ధోని ఆ తర్వాత ట్రంప్‌ తో కలిసి గోల్ఫ్‌ ఆడాడు.

ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ధోని మిత్రుడు..
ధోనితోపాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిత్రుడు సంఘ్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ధోని – ట్రంప్‌లు గోల్ఫ్‌ ఆడిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేశాడు. ధోని యూఎస్‌ ఓపెన్‌ మ్యాచ్‌ను కూడా సంగ్వీతో కలిసి చూశాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version