MS Dhoni : ధోని కూడా తప్పు చేశాడు.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్

ధోని న్యాయంగా నడుచుకుని ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఫీల్ అయ్యే వాడిని కాదు'' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం హర్పల్ చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

Written By: NARESH, Updated On : May 26, 2023 11:10 pm
Follow us on

MS Dhoni : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్ లో ధోని చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిబంధనలను పక్కాగా ఫాలో అయ్యే ధోని క్వాలిఫైయర్-1 లో భాగంగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే వార్తలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఒక మాజీ అంపైర్.. మహేంద్ర సింగ్ ధోని చేసిన పని పట్ల కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ధోని తప్పు చేశాడు అందుకే అంపైర్లు అలా చేశారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని ఎంత చెబితే అంత. ఒక్కోసారి ధోని నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎదురు చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. దీనికి కారణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ధోనీకి నిబంధనల పట్ల ఉన్న పూర్తిస్థాయి అవగాహన కారణంగా పలువురు పేర్కొంటారు. మహి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక లోతైన ఆలోచన ఉంటుందని జట్టు సభ్యులు భావిస్తుంటారు. అందుకే అతని నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించరు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ధోని చెప్పినట్లు అంపైర్లు కూడా వినడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్న ధోని తాజాగా ఒక మాజీ అంపైర్ కూడా మహేంద్రుడు చేసిన పనికి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ అంపైర్ డారి హార్పర్ ధోని మీద ఈ విషయంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆ మ్యాచ్ లో మొండిగా వ్యవహరించిన ధోని..

ఐపీఎల్ లో భాగంగా క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో మహేష్ పతిరానా కోసం ధోని ఎంపైర్ అలీతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ 16వ ఓవర్ లో చెన్నై పేసర్ మహేష్ పతిరానా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే అంతకు ముందు అతను తొమ్మిది నిమిషాలపాటు గ్రౌండ్ లో లేడు. నిబంధనల ప్రకారం 9 నిమిషాలు ఫీల్డింగ్ చేస్తేనే బౌలింగ్ కి అనుమతిస్తారు. అయితే అంపైర్లు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. ఈ సమయంలో అంపైర్ తో ధోని మొండిగా వ్యవహరించడమే కాకుండా సమయాన్ని కూడా వృధా చేశాడు. ఇప్పుడు ఇదే విషయంపై అంపైర్ డారిల్ హార్పర్ స్పందించాడు. ధోని తీరును కాస్త విమర్శించాడు.

ధోని వ్యవహరించిన తీరు బాధించింది..

దీనిపై మాట్లాడిన డారిల్ హార్పర్.. ” మహేంద్రసింగ్ ధోని సమయాన్ని వృధా చేశాడనే విషయం అందరికీ తెలుసు. అంపైర్లకు కూడా ఆ విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సంఘటన నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ధోని అభిమానిగా ఈ సంఘటనను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా మహి లాంటి వ్యక్తి వ్యవహరించడం.. దాన్ని చూస్తూ అంపైర్లు ఊరుకోవడం నాకు ఏదోలా ఉంది. కొందరు వ్యక్తుల ఇమేజ్, క్రేజ్ క్రీడా స్ఫూర్తి కంటే.. క్రీడా చట్టాలు కంటే పెద్దగా ఉంటుంది. ధోని ఇమేజ్, పాపులారిటీ, క్రేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్, బీసీసీఐ కూడా సరిపోవు. అందుకే అంపైర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. ధోని న్యాయంగా నడుచుకుని ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఫీల్ అయ్యే వాడిని కాదు” అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం హర్పల్ చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.