Simran: 5 పదుల వయస్సు వచ్చినప్పటికీ, ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ తో సరిసమానంగా ఫిజిక్, అందాన్ని మైంటైన్ చేస్తూ, ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి సిమ్రాన్(Heroine Simran). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసింది. చిరంజీవి కి తప్ప మిగిలిన ముగ్గురు హీరోలకు ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్స్ ని అందించింది సిమ్రాన్. చిరంజీవి తో చేసిన ‘మృగరాజు’, ‘డాడీ’ చిత్రాల ఫలితాలు మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా సిమ్రాన్ హీరోయిన్ గా సినిమాలు చేయొచ్చు, ఆ రేంజ్ అందాన్ని మైంటైన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆమె కేవలం క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్, లేదా విలన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టూడెంట్ నెంబర్ వన్ హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
రీసెంట్ గా విడుదలైన అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రంలో కూడా సిమ్రాన్ ఒక చిన్న పాత్రలో కనిపించి ఆడియన్స్ కి సప్రైజ్ ని అందించింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే సిమ్రాన్ ఒక స్టార్ హీరోయిన్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన నా తోటి హీరోయిన్ కి మెసేజ్ పంపాను. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ సినిమాలోని పాత్రని చూసి, ఎంతో మెచ్చుకున్నాను. దానికి ఆమె నుండి వచ్చిన సమాధానం చూసి నేను షాక్ కి గురి అయ్యాను. ఆంటీ పాత్రలు పోషించడం కంటే, ఇలాంటి పాత్రలు చేయడం చాలా బెటర్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకో ఆమె ఆంటీ పాత్రలను చాలా చులకనగా చేసి మాట్లాడినట్టు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా ఆ హీరోయిన్ కి నేను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. పనికిమాలిన డబ్బా పాత్రలు చేయడం కంటే, ఆంటీ పాత్రలు, అమ్మ పాత్రలు చేయడం లో ఎలాంటి తప్పు లేదు. ఏ పాత్ర చేసిన ఆత్మస్థైర్యం తో చేయాలి, మనస్ఫూర్తిగా శ్రద్ద పెట్టి చెయ్యాలి. అప్పుడు ఎలాంటి పాత్ర చేసిన అద్భుతమైన గుర్తింపు వస్తుంది. ఏ పాత్రని కూడా చులకన చేసి మాట్లాడడం సరికాదు’ అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్. తోటి నాటికీ సిమ్రాన్ ఇంత ఫైర్ గా సమాధానం ఇవ్వడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. పోనీ ఆమెని ఉద్దేశించి ఆంటీ రోల్స్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడిందా అంటే అది కూడా లేదు, ఎందుకంటే సిమ్రాన్ ఇప్పటి వరకు ఆంటీ రోల్స్ చేయలేదు కాబట్టి. అయినప్పటికీ ఆమెకు అంత కోపం వచ్చిందంటే, నిజంగా గమనించదగ్గ విషయమే అని చెప్పాలి.
Also Read: వైభవ్ సూర్య వంశీ.. సోషల్ మీడియాలో ఈ బుడ్డోడే ఇప్పడు వైరల్