Mohammed Shami Retirement: కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ రిటైర్మెంట్ ప్రకటించాలని కొంతమంది పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని మొదట్లో మహమ్మద్ షమీ పెద్దగా పట్టించుకోలేదు. అతడు నిశ్శబ్దంగా ఉంటే ఈ ప్రచారం మరింత పెరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో మహమ్మద్ షమి వ్యక్తిగత జీవితం అనేక కుదుపులకు గురవుతోంది. దీంతో మహమ్మద్ షమీ స్పందించక తప్పలేదు.
Also Read: కొత్తలోక చాప్టర్ 1′ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
” మీరు అనుకున్నట్టుగా నేను ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాలి. నావల్ల మీకు ఏమైనా సమస్య ఎదురవుతోందా.. పోనీ నావల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతోందా? ఎందుకు నన్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు.. నీకు చెప్పి నేను క్రికెట్ ను నాకు ఆసక్తికరమైన అంశంగా ఎంచుకోలేదు. నాకంటూ ఒక ఇష్టం ఉంది. నాకంటూ ఒక అభిప్రాయం ఉంది దానికి తగ్గట్టుగానే నేను అడుగులు వేస్తాను. నా ఇష్టానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంటారు. అంత తప్ప మీ ఇష్టానికి అనుకూలంగా నేను నడుచుకోలేను.. నాకు క్రికెట్ అంటే బోర్ కొట్టినప్పుడు కచ్చితంగా వెళ్ళిపోతాను. నన్ను జాతీయ జట్టులోకి తీసుకోకపోతే కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతుంటాను. నాకు అవకాశం లభించిన చోట ప్రతిభను నిరూపించుకుంటాను. నన్ను ఎంపిక చేయనందుకు ఎవరిని కూడా నిందించను. నాకంటూ అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజు నా ప్రతిభను నిరూపించుకుంటాను. దానికోసమే నేను కష్టపడుతున్నానని” షమీ వ్యాఖ్యానించాడు.
అప్పటినుంచి..
2023 వరల్డ్ కప్ లో షమీ అదరగొట్టాడు. ఆ తర్వాత అతడికి పాదానికి గాయాలయ్యాయి. అనంతరం అతడు లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమయ్యాడు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీలో తర్ఫీదు పొందాడు. టి20 వరల్డ్ కప్ లో ఆడతాడు అనుకున్నప్పటికీ అవకాశం లభించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనికి అవకాశం లభించలేదు. చివరికి ఐపీఎల్ లో హైదరాబాద్ తరఫున ఆడినప్పటికీ అంతగా ప్రతిభ చూపించలేకపోయాడు. ఇటీవల ఆసియా కప్ లో కూడా అతడికి అవకాశం లభించలేదు. అందువల్లే కొంతమంది పని కట్టుకొని రిటర్మెంట్ ప్రకటించాలని ఈ ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.