Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టీమిండియా – ఆస్ట్రేలియా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. పెర్త్ టెస్టులో భారత్ గెలిచింది. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా 1-1 తో రెండు జట్లు సమానంగా నిలిచాయి. ఈ సిరీస్ లో కీలకమైన మూడవ టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా శనివారం భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానంపై విపరీతమైన తేమ ఉండడం.. వాతావరణం చల్లగా ఉండడం.. మైదానంపై గడ్డి ఉండడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు ఊహించినట్టుగా భారత బౌలర్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై పట్టు సాధించలేదు. రోహిత్ అంచనా వేసినట్టుగా వికెట్ల మీద వికెట్లు తీయలేదు. దీనికి తోడు అక్కడ పలు మార్లు వర్షం కురిసింది. దీంతో తొలి సెషన్ ఆట మొత్తం వరుణ దేవుడు అంకితం చేసుకున్నాడు. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు పరిమితం కావలసి వచ్చింది. వర్షం తగ్గినప్పటికీ మైదానం ఆరకపోవడంతో ఆట సాగే పరిస్థితి లేకుండా పోయింది.
ఆస్ట్రేలియా అభిమానుల వెర్రితనం
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు విపరీతమైన అహంభావం ఉంటుంది.. అయితే గత కొంతకాలంగా అది తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దానిని ఆస్ట్రేలియా అభిమానులు అందిపుచ్చుకున్నారు. ప్రత్యర్థి ప్లేయర్లను విమర్శించడం మొదలుపెట్టారు. ఈ అనుభవం టీమ్ ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఎదురైంది. గబ్బా మైదానంలో సిరాజ్ బౌలింగ్ వేస్తుండగా ఆస్ట్రేలియా అభిమానులు గట్టిగా అరిచారు. ఇటీవల మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది స్పోర్ట్స్ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ పై ఆస్ట్రేలియా అభిమానులు ఆగ్రహం పెంచుకున్నారు. దానికి తగ్గట్టుగానే శనివారం అతను బౌలింగ్ చేస్తుండగా గట్టిగా అరిచారు. గత మ్యాచ్లో హెడ్ పై సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆస్ట్రేలియా అభిమానులు జీర్ణించుకోలేక ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. అయితే ఆస్ట్రేలియా అభిమానులు వ్యవహరించిన తీరుపై టీమిండియా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులకు ఇలాంటి దిక్కుమాలిన వ్యవహార శైలి అలవాటేనని.. వారి వద్ద నుంచి అంతకుమించి ఆశించడం కూడా మన తప్పిదమే అవుతుందని వారు అంటున్నారు. అలాంటి వాళ్లకు ఆట తీరుతోనే బుద్ధి చెప్పాలని టీమిండియా ప్లేయర్లకు సూచిస్తున్నారు.
Big boo for siraj from the crowd#AUSvIND #TheGabba pic.twitter.com/rQp5ekoIak
— ٭٭ (@nitiszhhhh) December 14, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mohammad siraj received harsh treatment from the gabba crowd over the travis head controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com