Mohammad Rizwan: అనామకంగా ఆడే ఆటగాడి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. అలాంటి ప్లేయర్లను అభిమానులు కూడా పట్టించుకోరు. ఎంతో కొంత ఆట వచ్చి.. అప్పుడప్పుడు నైపుణ్యం ప్రదర్శించే ప్లేయర్ల మీద అభిమానులకు భారీ అంచనాలు ఉంటాయి. ఇక నేటి కాలంలో క్రికెట్ అనేది ఎల్లలు దాటిపోయింది. టి20 వల్ల దాదాపు చాలా వరకు దేశాలు లీగ్ లు నిర్వహిస్తున్నాయి. అందులో ప్రధానమైనది BBL(Big Bash cricket League).
బిబిఎల్ లో పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ ఆడుతున్నాడు. ఇతడు మెల్బోర్న్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడి మీద మెల్ బోర్న్ జట్టు భారీగానే అంచనాలు పెట్టుకుంది. కానీ వాటిని అందుకోవడంలో ఇతడు విఫలమయ్యాడు. పైగా నాసిరకమైన ఆట తీరు ప్రదర్శించడంతో సోషల్ మీడియాలో ఇతడి మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీసుకునే ఫీజుకు, ఆడే ఆటకు ఎటువంటి సంబంధం లేకపోవడంతో..ఇటువంటి ఆటగాడిని ఎందుకు తీసుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బిబిఎల్ లో భాగంగా తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో రిజ్వాన్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. 23 బంతులు ఎదుర్కొని 26 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఆట తీరు చూడలేక మేనేజ్మెంట్ బయటికి రావాలని కబురు పంపింది. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో అతడి మీద విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకొని ఎందుకు మా సహనంతో ఆడుకుంటున్నారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అసలు ఏమాత్రం చురుకుదనం లేని ఆటగాడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ” అతని ఆట గల్లి స్థాయి లాగా కూడా లేదు. ఇటువంటి ఆటగాడికి డబ్బులు భారీగా చెల్లించి ఎందుకు జట్టులోకి తీసుకున్నారు అర్థం కావడం లేదు. టి20 అనేది వేగానికి ప్రతీక. అటువంటి వేగాన్ని ఇతడు ఏమాత్రం చూపించడం లేదు. దూకుడుగా బ్యాటింగ్ చేయాల్సిన చోట ఇలా బంతులను తింటున్నాడు. పరుగులు చేయడం కాదు కదా.. డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి ఆటగాడికి అవకాశాలు ఎందుకు కల్పిస్తున్నారు అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం వచ్చే సీజన్లో రిజ్వాన్ ఆడే అవకాశం ఉండదని తెలుస్తోంది. అతడి ఆట తీరు చూసిన తర్వాత మెల్ బోర్న్ మేనేజ్మెంట్ అవకాశాలు ఇవ్వడం కష్టమని తెలుస్తోందని ఆస్ట్రేలియా మీడియా తన కథనాలలో అభిప్రాయపడింది. ఈ ప్రకారం చూసుకుంటే ఇదే సీజన్ రిజ్వాన్ కు చివరిదని ప్రచారం జరుగుతోంది.
BIGGEST SHAME FOR RIZWAN IN BBL
– Muhammad Rizwan has been retired out by the Melbourne Renegades. The signal comes from Sutherland to retire Rizwan out
– Rizwan’s ends with 26 off 23 balls – strike rate of 113
– What’s your take pic.twitter.com/TjGvUtTpKb
— Richard Kettleborough (@RichKettle07) January 12, 2026