Mithali Raj : క్రికెట్ కు వీడ్కోలు పలికిన లేడీ సచిన్ ‘మిథాలీ రాజ్’

Mithali Raj Announces Retirement From All Forms Of International Cricket : భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి బుధవారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్నాళ్లుగా తనకు ప్రేమను మద్దతును ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఆమె టీమిండియా మహిళా జట్టు తరపున 232 […]

Written By: NARESH, Updated On : June 9, 2022 12:24 pm

Mithali Raj

Follow us on

Mithali Raj Announces Retirement From All Forms Of International Cricket : భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి బుధవారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్నాళ్లుగా తనకు ప్రేమను మద్దతును ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఆమె టీమిండియా మహిళా జట్టు తరపున 232 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. 50.68 సగటుతో 7805 పరుగులు చేశారు. మిథాలీ జూన్ 1999లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌లో జరిగిన ఐసిసి మహిళల ప్రపంచ కప్‌లో ఆమె భారత్‌కు సారథ్యం వహించింది. ఈ టోర్నమెంట్ లో భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

వన్డే, టెస్ట్ మహిళా జట్ల కెప్టెన్ గానూ వ్యవహరించిన మిథాలీరాజ్ అరుదైన మైలురాయిని అందుకున్నారు. టెస్ట్, వన్డే, లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్ లు కలిపి 20 వేల పరుగులు చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించింది. మహిళా క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గా ఈమెను పిలుస్తారు. వన్డేలో వరుసగా ఐదో అర్థసెంచరీతోపాటు 20వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన మిథాలీ టీమ్ ఇండియా తరుఫున ఎన్నో మ్యాచ్ లు ఆడారు. ప్రపంచక్రికెట్ లో 200కుపైగా వన్డే మ్యాచ్ లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే కావడం విశేషం.

మిథాలీ రాజ్ టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్ గానూ చాలా రోజులు చేసింది. ఆమె కెప్టెన్సీలోనే 2017 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌ వరకూ భారత్ జట్టు చేరుకుంది. ఫైనల్ లో ఇంగ్లాండ్‌ చేతిలో తృటిలో ఓడిపోయారు. 2005లో ఐసిసి మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయినప్పుడు మిథాలీ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది.

ఈ సందర్భంగా రిటైర్ మెంట్ ప్రకటన చేస్తూ “సంవత్సరాలుగా మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు! మీ ఆశీర్వాదం మరియు మద్దతుతో నా 2వ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాను” అని మిథాలీ ట్వీట్ చేసింది.

మిథాలీ రాజ్ ప్రకటనలో ఉద్వేగానికి గురైంది. ‘ దేశానికి ప్రాతినిధ్యం వహించడం అత్యున్నత గౌరవం కాబట్టి నేను ఇండియా బ్లూ కలర్‌ను ధరించే ప్రయాణంలో ఒక చిన్న అమ్మాయిగా బయలుదేరాను. ప్రయాణం చాలా ఎత్తుపల్లాలు.. ఉన్నా నిలదొక్కుకున్నాడు. ప్రతి సంఘటన నాకు ఏదో ఒక ప్రత్యేకతను నేర్పింది. గత 23 సంవత్సరాలుగా చాలా సంతృప్తికరంగా జీవితం గడిచింది., నా జీవితంలో సవాలు మరియు ఆనందించే సంవత్సరాలు మరిచిపోలేనివి. అన్ని ప్రయాణాలలాగే ఇది కూడా ముగియాలి. ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్న రోజు. నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, భారత్‌ను గెలిపించాలనే ఉద్దేశ్యంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. త్రివర్ణ పతాకానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను.
చాలా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల చేతుల్లో జట్టు ఉన్నందున, భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నందున నా ఆట జీవితాన్ని తెరపైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. ముందుగా ఒక క్రీడాకారిణిగా, ఆ తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నాకు లభించిన అన్ని మద్దతు కోసం నేను బీసీసీఐ.. బీసీసీ గౌరవ కార్యదర్శి జే షా కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.. మీ అందరి ప్రేమ & మద్దతుకు ధన్యవాదాలు’’ అంటూ మిథాలీ రాజ్ ముగించింది.

Also Read: