https://oktelugu.com/

Mitchell Starc: చెన్నై టీమ్ లోకి మిచెల్ స్టార్క్ ధోనీ తో టచ్ లో ఉన్న స్టార్క్…

నిజానికి ఐపీఎల్ లో ఆడటానికి చాలా మంది ప్లేయర్లు కూడా మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.అయితే ఇప్పటి వరకు జరిగిన ఐపీల్ సీజన్ లలో ఎక్కువ సార్లు ముంబై, చెన్నై రెండు కూడా చెరో ఐదు సార్లు కప్పును అందుకొని టాప్ పొజిషన్ లో ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : October 11, 2023 4:33 pm
    Mitchell Starc

    Mitchell Starc

    Follow us on

    Mitchell Starc: ఇండియా లో ఐపీఎల్ అంటే అందరికి విపరీతమైన ఇష్టం ఉంటుందని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ కోసం చాలా బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటె ఐపీఎల్ లో ఏ టీం గెలుస్తుంది ఏ టీం ఓడిపోతుంది అంటూ చాలా మంది చాలా రకాలైన చర్చలు చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఇండియా అనే కాదు ప్రతి ఒక్క దేశం లో ఉన్న క్రికెట్ అభిమానులు అద్నారు కూడా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

    నిజానికి ఐపీఎల్ లో ఆడటానికి చాలా మంది ప్లేయర్లు కూడా మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.అయితే ఇప్పటి వరకు జరిగిన ఐపీల్ సీజన్ లలో ఎక్కువ సార్లు ముంబై, చెన్నై రెండు కూడా చెరో ఐదు సార్లు కప్పును అందుకొని టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్ లో ప్రతి టీం కూడా ఇప్పటికే చాలా బాగా ఆడుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవడం కోసం చాలా రకాలు గా ట్రై చేస్తూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ప్రతి టీం గెలవడం కోసం తీవ్రం గా పోరాటం చేస్తూ ఉంటుంది.అందుకే ఒక టీం లో ఎక్కువమంది మ్యాచ్ విన్నర్లు ఉండే విధంగా టీంని తీసుకోవడం జరుగుతుంది…

    ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన మిచెల్ స్టార్క్ మళ్లీ ఐపీల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.తాజా గా ఆయనే ఈ విషయం మీద స్పందిస్తూ 2024 లో జరిగే ఐపీల్ కోసం తాను ఆడబోతున్నట్టు గా చెప్పాడు.ఇక ఇంతకు ముందు 2014 , 2015 లో ఈయన బెంగుళూర్ టీం తరుపున బరిలోకి దిగాడు. ఇక ఆ తర్వాత 2016 వ సీజన్ లో కలకత్తా తరుపున ఆడిన స్టార్క్ ఆ సీజన్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడకుండానే గాయం కారణంగా మ్యాచ్ లకి దూరం అయ్యాడు…ఆ తర్వాత టీం ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఆస్ట్రేలియన్ టీం కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆడుతాడు. ఐపీఎల్ లాంటి లీగ్ మ్యాచ్ లు ఆడటం వల్ల దేశానికి జరిగే వన్డే, టెస్ట్ మ్యాచ్ ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాం అని ఆయన కొద్దిరోజులు ఐపీఎల్ లాంటి ఏ లీగ్ మ్యాచులు కూడా ఆడకుండా వాటన్నింటికి దూరం అయ్యాడు….

    ఇక ప్రస్తుతం ఆయన ఐపీల్ లో చెన్నై టీం లోకి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే చెన్నై టీం లో అయితే ఆయనకి ఎక్కువ గా ఫ్రీడమ్ దొరుకుతుంది అని అలాగే ధోని సారధ్యం లో ఆడే అవకాశం కూడా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇక చెన్నై టీం కి కూడా ఒక మంచి పేస్ బౌలర్ కావాలి. కాబట్టి అది స్టార్క్ లాంటి ఒక మంచి పేసర్ టీం లో ఉంటె ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.అందులో భాగం గానే ఇప్పటికే స్టార్క్ ధోని ఇద్దరు కూడా కలిసి ఈ విషయం మీదా మాట్లాడుకుంటున్నట్టు గా కూడా తెలుస్తుంది.ఇక వార్త లో ఎంత వరకు నిజం ఉందొ తెలీదు కానీ స్టార్క్ మాత్రం 2024 ఐపీఎల్ లో పాల్గొంటున్నాడు…