https://oktelugu.com/

టీ-20లోనూ మంత్రి హరీష్ రావు ‘దూకుడు’..!

తెలంగాణలో నిన్నటి వరకు దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికలతో నేతలంతా బీజీగా గడిపారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో నేతలంతా కాస్తా రిలాక్స్ అవుతున్నారు. ఇక నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు.. రాజకీయాలతో ఫుల్ బీజీగా ఉండే మంత్రి హరీష్ రావు మాత్రం బుధవారం రాత్రి క్రికెట్ ఆడి అభిమానుల్లో జోష్ నింపారు. Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..? సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి సిద్ధిపేట-హైదరాబాద్ జట్ల మధ్య ఫ్రెండ్లీ టీ-20 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2020 12:56 pm
    Follow us on

    Minister Harish Rao Friendly T20 Cricket Match

    తెలంగాణలో నిన్నటి వరకు దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికలతో నేతలంతా బీజీగా గడిపారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో నేతలంతా కాస్తా రిలాక్స్ అవుతున్నారు. ఇక నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు.. రాజకీయాలతో ఫుల్ బీజీగా ఉండే మంత్రి హరీష్ రావు మాత్రం బుధవారం రాత్రి క్రికెట్ ఆడి అభిమానుల్లో జోష్ నింపారు.

    Also Read: అతివిశ్వాసమా.. మొండి తనమా..?

    సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి సిద్ధిపేట-హైదరాబాద్ జట్ల మధ్య ఫ్రెండ్లీ టీ-20 మ్యాచ్ జరిగింది. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జట్టుకు మంత్రి హరీశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ టీమ్ మెంబర్ గా ఆడారు. ఇక హైదరాబాద్‌ మెడికోవర్‌ హస్పిటల్ జట్టుకు డాక్టర్‌ కృష్ణకిరణ్‌ కెప్టెన్సీ చేశారు.

    ముందుగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన సిద్దిపేట జట్టు నిర్ణిత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన హరీష్ రావు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. 12బంతుల్లో 3 ఫోర్లతో 18పరుగులు చేసి అలరించారు. వరుసగా రెండు బౌండరీలు కొట్టి హరీష్ రావు దూకుడు చూపించారు.

    Also Read: ఓల్డ్ మలక్ పేటలో కొనసాగుతున్న రీ పోలింగ్.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్..!

    మంత్రి హరీష్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. రాజకీయాల్లో దూకుడు చూపించే హరీష్ రావు క్రికెట్లోనూ తనదైన శైలిలో వరుస బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఆయన బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అభిమానులు కేకలతో హోరెత్తించారు. ఈ మ్యాచ్ లో హరీష్ రావు నేతృత్వం వహిస్తున్న సిద్దిపేట జట్టు హైదరాబాద్ పై 15పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చూస్తేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్