అతివిశ్వాసమా.. మొండి తనమా..?

ఏ నాయకుడైనా… ప్రజలకు, పార్టీ నేతలకు కొంత సమయం కేటాయిస్తారు. వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి లాంటి మహానేత కూడా ప్రజాదర్బార్‌‌, రచ్చబండ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ ఇందుకు అతీతంగా మారిపోయారు. ఆయనను కలవాలంటే అంత ఈజీ కాదు… ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పట్టించుకోడు. ఫాం హౌస్‌ దాటి బయటికి రాదు.. ప్రగతి భవన్‌ తప్ప సచివాలయం వైపు కన్నెత్తి చూడడంటూ నెత్తినోరు మెత్తుకున్నా కనీసం స్పందించడు. ఇది అతివిశ్వాసమో.. మొండితనమో […]

Written By: Srinivas, Updated On : December 3, 2020 11:36 am
Follow us on


ఏ నాయకుడైనా… ప్రజలకు, పార్టీ నేతలకు కొంత సమయం కేటాయిస్తారు. వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి లాంటి మహానేత కూడా ప్రజాదర్బార్‌‌, రచ్చబండ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ ఇందుకు అతీతంగా మారిపోయారు. ఆయనను కలవాలంటే అంత ఈజీ కాదు… ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పట్టించుకోడు. ఫాం హౌస్‌ దాటి బయటికి రాదు.. ప్రగతి భవన్‌ తప్ప సచివాలయం వైపు కన్నెత్తి చూడడంటూ నెత్తినోరు మెత్తుకున్నా కనీసం స్పందించడు. ఇది అతివిశ్వాసమో.. మొండితనమో గాని, పతనానికి కూడా కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: ఓల్డ్ మలక్ పేటలో కొనసాగుతున్న రీ పోలింగ్.. సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్..!

కొన్నాళ్లే హవా..

ఏ నాయకుడిదైనా కొన్నాళ్లపాటు హవా కొనసాగుతుంది. ఎన్టీఆర్‌‌ అలాంటి హవా నుంచి ఎలా పతనం అయ్యారో కూడా తెలుగు ప్రజలు చూశారు. ఎవరిని నిలబెట్టి అయినా గెలిపించుకుంటాననే అతివిశ్వాసాన్ని ప్రదర్శించిన ఆయన… చివరకు ఎమ్మెల్యేల చేతిలోతోనే దెబ్బతిన్నారు.

ఉద్యమ కాలం వేరు..

సీఎం కేసీఆర్‌‌కు ఉద్యమనాయకుడిగా ఉన్న పేరు వేరు. ఎక్కడ సభ పెట్టినా లక్షల మంద జనం హాజరయ్యే వాళ్లు. రెండు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. ఏ పిలుపు ఇచ్చినా లక్షల మంది స్వచ్ఛందంగా స్పందించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.. టీఆర్‌‌ఎస్‌ కంప్లీట్‌గా రాజకీయ పార్టీగా మారింది. గతంలో ఆంధ్రోళ్లను తిడితేనో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఫోకస్‌ చేస్తనే ఓట్లు పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓట్లు అడిగేందుకు వెళ్తే ఇన్నాళ్లు ఏం అభివృద్ధి చేశారు.. భవిష్యత్‌లో ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఆధార్ ఉంటేనే రేషన్ సరుకులు..?

పరిస్థితులకు అనుగుణంగా మారాలి

ఏ నాయకుడైనా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మారాలి. కేసీఆర్‌‌ మీద ఉన్న ప్రధాన ముద్ర పార్టీ నేతలు, ప్రజలను కలవడు అని. ప్రగతి భవన్‌కు వెళ్లడం మంత్రులకే సాధ్యం కాదని ప్రతిపక్ష నేతలు రోజుకోచోట ఆరోపిస్తుంటారు. రెండేళ్లుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలకు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వారిని కలిసి వారి సమస్యలేంటో తెలుసుకోవాలని సీఎంకు సూచించారు. నిజానికి స్వామి గౌడే కాదు… చాలామంది టీఆర్‌‌ఎస్‌ నేతలు అసంతృప్తితో ఉన్నారు.. మరోవైపు బీజేపీ దూకుడుగా ఉంటోంది. కేసీఆర్‌‌ తన తీరు మార్చుకోకపోతే ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్