ఏపీలో ప్రతీకార రాజకీయాలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే జగన్ ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంధ్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ జైలు పాలు అవ్వగా.. ఇప్పుడు మరో మంత్రికి ఉచ్చు బిగుసుకుంటోంది.
Also Read: పోలవరం పంచాయితీ.. ఎవరి మాట కరెక్ట్?
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో అధికారులు వేగం పెంచారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంధ్రకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఆయనను విచారణకు హాజరు కావాలని సెక్షన్ 91 కింద రవీంద్రకు నోటీసులు ఇచ్చారు.
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు మచిలీపట్నంలో సంచలనంగా మారింది. పేర్ని నాని పక్కనే తిరుగుతూ రెక్కీ నిర్వహించి మరీ ఆయనపై హత్యాయత్నంచేసిన నాగేశ్వరరావును పోలీసులు విచారించారు. అతడి కాల్ డేటాలో పలువురు టీడీపీ నేతలతో మాట్లాడినట్టు పోలీసులు నిర్ధారించారు.
Also Read: పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్.. షాక్‌లో వైసీపీ శ్రేణులు
ఈ నేపథ్యంలోనే ఆ టీడీపీ నేతలను కూడా పోలీసులు విచారించారు. నిందితుడు నాగేశ్వరరావు సోదరి ఉమాదేవి హస్తం కూడా ఉందని పోలీసులు కనిపెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రికి నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్