https://oktelugu.com/

Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 లోకి జగపతి బాబు ఎందుకొచ్చాడు? అసలేంటి కొత్త పాత్ర వెనుక కథ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప-1' చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా 'పుష్ప-2' రాబోతోంది.

Written By:
  • Rocky
  • , Updated On : November 17, 2024 / 07:20 PM IST
    Follow us on

    Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రెండు మూడు సార్లు సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చేశారు మేకర్స్. ప్రస్తుతం డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు గ్లింప్స్, సాంగ్స్ అప్‌డేట్‌లు సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ వచ్చేసింది.

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-1’ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ రాబోతోంది. నవంబర్ 17 సాయంత్రం పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ‘పుష్ప-2’ ట్రైలర్‌ను విడుదల చేశారు. 2 నిమిషాల 45 సెకన్ల నిడివిగల ట్రైలర్ విడుదలైంది. ఏనుగుల గర్జన, ఎర్రచందనం స్మగ్లింగ్, భారీ డబ్బు విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది. ‘డబ్బంటే లెక్క లేదు, అధికారం అంటే భయం లేదు, ప్రాణం అంటే లెక్క లేదు అంటూ’ అంటూ జగపతిబాబు చెప్పిన డైలాగ్‌తో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను పరిచయం చేశారు. హీరో ఎలివేషన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రతో యాక్షన్‌తో పాటు రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది.

    పుష్పరాజ్, షాకావత్ (ఫహద్ ఫాజిల్) మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ తో ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పారు. డైలాగులు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. అలాగే అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, గెటప్, విజువల్స్, నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ‘రప్పా రప్పా’, ‘పుష్ప పువ్వు కాదు నిప్పు కాదు.. మండుటెండ’ అంటూ ట్రైలర్ ముగించిన తీరు మరో స్థాయిలో ఉంది. మొత్తానికి పుష్పరాజ్ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

    ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమాలో కొత్త క్యారెక్టర్లు యాడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు. ఆయన పుష్ప 1లో చేయలేదు. కానీ సుకుమార్ గత రెండు చిత్రాలు నాన్న కు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో నటించారు. దీంతో మూడో సినిమాలోనూ ఆయనను తీసుకున్నారు. ఈ సినిమాలో ఆయన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఫహద్‌కు అండగా నిలిచే రాజకీయ నాయకుడి పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడని అంటున్నారు. పుష్పకు సపోర్ట్ చేసే రావు రమేష్‌ని ఎదిరించే పాత్రలో జగపతి కనిపించనున్నాడు.

    పుష్ప 2 ది రూల్ కాబట్టి అందులో హీరో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్ గా ఎదుగుతారు. అలా నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తుంటారు. ‘డబ్బంటే లెక్క లేదు, అధికారం అంటే భయం లేదు, ప్రాణం అంటే లెక్క లేదు అంటూ’ అనే డైలాగ్ ప్రకారం అల్లు అర్జున్ లోకల్ వాళ్లంటే భయపడే స్థాయి దాటిపోయినట్లు.. అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే పొలిటికల్ పవర్ కావాల్సి ఉంటుందని జగపతిబాబును మినిస్టర్ పదవిలో చూపించినట్లు తెలుస్తోంది. ఈ పార్టులో జగపతి బాబే మెయిన్ విలన్ గా హీరోను ఎదుర్కొనబోతున్నట్లు అర్థం అవుతుంది.

    పుష్ప 2లో జగపతి బాబు మాత్రమే కాకుండా మరి కొందరు నటులు కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే ఎలాంటి పాత్ర అన్నది థియేటర్లోనే చూడాలి. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకోనున్నారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఈ సినిమాలో నటించింది. ఈమె సినిమాలో ఓ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.