Team India Odi World Cup 2023: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండవ వన్డే మ్యాచ్లో భారత్ ఎవరు ఊహించని విధంగా పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ప్రపంచ కప్ కోసం సన్నాహాల్లో బిజీగా ఉన్న భారత్ జట్టుకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. కనీసం మెగా ఈ వెంట్రుక క్వాలిఫై కూడా కానీ ఒక టీం చేతులలో ఘోర పరాజయం పాలు కావడం ఇండియన్ క్రికెట్ టీం సభ్యులకు మింగుడు పడడం లేదు. 2023 లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ స్టార్ట్ కావడానికి గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. పైగా ఈసారి ప్రపంచ కప్ వేదికగా అందరికీ ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం మనదే.
కాబట్టి ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ నెగ్గాలి అని సంకల్పంతో టీం ఇండియా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వెస్టిండీస్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు పేలవమైన పర్ఫామెన్స్ అందరినీ నిరాశకు గురిచేస్తుంది. మరి ముఖ్యంగా టీమ్ ఇండియన్ మెయిన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తీసుకున్న బొక్క నిర్ణయం ఆటపై భారంగా పడింది. జరగబోయే మూడవ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ కు రెండవ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో చాలా మంది ప్లేయర్స్ ఆడడానికే తడబడి సింగిల్ డిజిట్ స్కోర్ తో సరిపుచ్చుకున్నారు.
గత కొద్ది కాలంగా భారత్ క్రికెట్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఎంతో బలహీనంగా ఉంది. ఎప్పుడు టీం ఇండియా గెలుపు మొదటి మూడు ప్లేయర్లు లేదా బౌలర్లపై ఆధారపడి ముందుకు సాగుతోంది. కోచ్ లు ఎందరు మారుతున్నా ,కాలం ఎంత గడుస్తున్నా ఈ విషయం ఎవరు సరి చేయలేకపోతున్నారు. 2019 నుంచి టీం ఇండియా గెలుస్తున్న అన్ని మ్యాచ్లలో ఎక్కువ వాటా విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్‌దే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ పటిష్టంగా నిలబడి మ్యాచ్ను గెలిపించిన సందర్భాలు వేళ్లపైన లెక్కపెట్టవచ్చు.
ఒకప్పుడు మ్యాచ్ అంటే మాన్ మాన్ గేమ్ గా ఉండేది. ఓపెనర్, మిడిల్ ఇలా తమ స్థానంతో సంబంధం లేకుండా ప్రతిభ కనబరిచి టీం కోసం పాటుపడే వాళ్ళు ప్లేయర్స్. కానీ ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ లో ఆ పట్టుదల కనిపించడం లేదు. అమ్మ వేసే ముట్టిక్కయ్ వేస్తే కానీ అన్నం తినను అన్నట్లు…విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే తప్ప మేము ఆడలేము అనే స్థితిలో ప్రస్తుతం టీమిండియా మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఉన్నారు. భారత్ వర్సెస్ వెస్టిండీస్ రెండవ ఈ మ్యాచ్లో జరిగినట్టు ఆ ఇద్దరి ప్లేయర్స్ లో ఎవరైనా రెస్ట్ తీసుకుంటే ఇక ఆరోజు ఆటపై ఆశ వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికైనా టీం ఇండియా మిడిల్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఇది మరింత జఠలమైన సమస్యగా మారే అవకాశం ఉంది. స్ట్రాంగ్ ప్లేయర్స్ కేవలం ఓపెనర్స్ గా ఉంటే సరిపోదు…ఇద్దరి ముగ్గురిపై భారం పెట్టి 11 మంది ఆటలోకి దిగడం సరికాదు. మరోపక్క టీమిండియా వైఖరి పై సీనియర్ ప్లేయర్ అయిన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఇచ్చిన సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ కూడా ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి.