https://oktelugu.com/

Manchu Vishnu: మా అధ్యక్షుడు మంచు విష్ణు షాకింగ్ డెసిషన్… వచ్చే ఎన్నికల్లో ఊహించని పరిణామం!

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే నినాదాన్ని మంచు విష్ణు వర్గం ప్రచారం చేశారు. ఇది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ప్రకాష్ రాజ్ వర్గం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి.

Written By:
  • Shiva
  • , Updated On : August 1, 2023 / 08:31 AM IST

    Manchu Vishnu

    Follow us on

    Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఒక న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 2021లో మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ పోటీ పడ్డాయి. సాధారణ ఎన్నికలకు మించిన హీట్ నడిచింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ వెనుక మెగా ఫ్యామిలీ నిలబడింది. మంచు విష్ణుకు సీనియర్ నటులతో పాటు ఒక సామాజిక వర్గం గట్టి మద్దతు ఇచ్చింది.

    ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే నినాదాన్ని మంచు విష్ణు వర్గం ప్రచారం చేశారు. ఇది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ప్రకాష్ రాజ్ వర్గం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి. మా అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక ఆయన వద్ద ఉందన్నారు. ఫైనల్ గా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణుదే పై చేయి అయ్యింది. మెజారిటీ ఓట్లు దక్కించుకుని మంచు విష్ణు మా అధ్యక్షుడు అయ్యారు.

    ఎన్నికల ప్రచారంలో మంచు విష్ణు ఇచ్చిన ప్రధాన హామీ మా బిల్డింగ్. తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తాను అన్నారు. మరి రెండేళ్లు అవుతుండగా మా బిల్డింగ్ నిర్మాణం మొదలైన దాఖలాలు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మంచు విష్ణు విఫలమయ్యారనే వాదన ఉంది. మంచు విష్ణు విజయంలో అన్నీ తానై వ్యవహరించిన నరేష్ ని మా బిల్డింగ్ గురించి అడిగితే అది మా అధ్యక్షుడుని అడగడం. దానికి సంబంధించిన సమాచారం ఆయన వద్దే ఉందన్నారు.

    మంచు విష్ణు పదవీకాలం మరో రెండు మూడు నెలల్లో ముగియనుంది. అయితే సెప్టెంబర్ లో జరగాల్సిన ఎన్నికలు 2024 మార్చికి వాయిదా వేశారని సమాచారం. కాగా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడనని మంచు విష్ణు తేల్చేశారట. మా ఎన్నికలకు దూరంగా ఉంటానన్నారట. ఇదే విషయాన్ని మా సభ్యులకు తెలియజేశాడట. దీంతో రాబోయే ఎన్నికల్లో కొత్త వ్యక్తి అధ్యక్షుడిగా బరిలో దిగనున్నారని తెలుస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత బాగా హర్ట్ అయ్యారు. మా ఎన్నికల జోలికి రాను అన్నట్లు మాట్లాడారు. మరి ఈసారి ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారో లేదో చూడాలి.