MI vs RCB : బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ రజత్ పాటిదార్(64) టాప్ స్కోరర్ లు గా నిలిచారు. చివర్లో జితేష్ శర్మ (40) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై జట్టులో బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. విగ్నేష్ ఒక వికెట్ సాధించాడు. ఇక అనంతరం 223 పరుగుల టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన ముంబై జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు.. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చిన రోహిత్ శర్మ (17) అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన అతడు.. యష్ దయాళ్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్.. వికెట్ సమర్పించుకున్నాడు.. దీంతో నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టడంతో రోహిత్ ఫామ్ లోకి వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ అదంతా ఆరంభ శూరత్వమని నిరూపించడానికి రోహిత్ ఎంతో సమయం తీసుకోలేదు. ఇక ఐపీఎల్ సీజన్లో రోహిత్ విఫల ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్న అతడు… బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. 9 బంతుల్లో 17 పరుగులు చేసినప్పటికీ.. దానిని బలమైన ఇన్నింగ్స్ లాగా మార్చలేకపోయాడు.
నాలుగు మ్యాచ్లలో 38 పరుగులు
ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రోహిత్.. ఒకదాంట్లో కూడా తనదైన మార్క్ చూపించలేదు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగు లకు అవుట్ అయిన రోహిత్.. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8…కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్లలో 38 పరుగులు చేసి.. అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు రోహిత్. మరోవైపు ఇదే మ్యాచ్లో రోహిత్ సమకాలికుడు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు తరఫున 67 పరుగులు చేశాడు. అంతేకాదు ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ 17 పరుగులకే అవుట్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ” రోహిత్ మీద ముంబై జట్టు ఎన్నో ఆశలు పెంచుకుంది. కానీ వాటిని రోహిత్ అడియాసలు చేస్తున్నాడు. బ్యాటింగ్ ఏమాత్రం గొప్పగా చేయడం లేదు. దారుణంగా అవుట్ అవుతున్నాడు. అసలు రోహిత్ శర్మ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదని” ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
YASH DAYAL WITH A FABULOUS DELIVERY TO GET THE HITMAN. pic.twitter.com/krD2fyRpO7
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2025