MI Vs LSG IPL 2025: ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 7 వికెట్లు లాస్ అయ్యి 215 రన్స్ చేసింది. రికెల్టన్ 58, సూర్య కుమార్ యాదవ్ 54 రన్స్ చేసి అదరగొట్టారు. మాయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం 216 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన లక్నో జట్టు 161 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో ముంబై జట్టు 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్నో జట్టులో ఆయుష్ బదోని 35, షాన్ మార్ష్ 34 పరుగులతో టాప్ స్కోరర్ లుగా నిలిచారు. ముంబై జట్టు బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు.. బౌల్ట్ 3, జాక్స్ 2 వికెట్లు సాధించారు.
Also Read: రిషబ్ పంత్.. మళ్లీ విఫలమయ్యాడు.. ఈసారి ఎన్ని పరుగులంటే..
సూర్య ప్రతాపం
ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన ప్రతాపాన్ని చూపించాడు. లక్నో బౌలర్ల పై ప్రారంభం నుంచే ఎదురు దాడికి దిగాడు. 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు. తద్వారా ఐపిఎల్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.. అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2,714 బంతుల్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఎబి డివిలియర్స్ ముందు వరుసలో ఉన్నాడు. 2,658 బంతుల్లో డివిలియర్స్ 4000 పరుగులు పూర్తి చేశాడు. క్రిస్ గేల్ 2,658 బంతుల్లో నాలుగు వేల పరుగులు పూర్తిచేసి డివిలియర్స్ తో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.అంతేకాదు… ప్రస్తుత ఐపీఎల్లో 400 పరుగులు పూర్తి చేసి సూర్య కుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సీజన్లో సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే అతడు మూడు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విభాగంలో ఇప్పటివరకు గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ 417 పరుగులతో మొదటి స్థానంలో ఉండేవాడు.. అయితే అతడిని సూర్య కుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ 427 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విభాగంలో టాప్ స్థానంలో ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భీకరంగా ఆడుతున్నాడు. ఏమాత్రం భయపడకుండా వీర విహారం చేస్తున్నాడు.. మిస్టర్ 360 అని అతడికి ఉన్న బిరుదును మరోసారి మైదానంలో నిరూపిస్తున్నాడు. భీకరమైన బ్యాటింగ్ చేస్తూ మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు.